పుట:సత్ప్రవర్తనము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

31


సితారామరాజువార్ల నాలించి యిట్టు లాలోచించెను. ఉపాధ్యాయులు పట్టుదల వహించిన, బాలకులు మొండికట్టు పట్టియున్నారు. ఇరువురు బాలుక నెన్నుకున్నంత మాత్రమున గొప్పలోపమేవియు లేదు. ఈ యాటలు నెలకొక్క పర్యాయము సాగునవియే. వారంత ముచ్చట పడినపు డుపా ధ్యాయులాలోచించి వారిని పిలుంబరచి మంచిమాటల నూఱడించిన వాకంగీకరించి యుందుఱు. నాయెఱిగినంత వరకాయిరువురు బాలకులు మంచి ప్రవర్తనము కలవారే. వారిచిత్తముల కంత యాగ్రహము కలగలజేసినవారెవరో తెలియరాదు. తొలుతనే వారి నీపర్యాయము విూరు మానుఁడు, ఇంకొక తడవ మిమ్ము తక్పక యెన్నుకుందుమని వారికిం దెలిపియున్న బాగుండేడిది. బాలకులెవ్వరు నాపనికి గడంగరైరి. ఇట్టి కలహము లూరకే కలగవు. సూత్రధారుల డొకందుండినంగాని యీ నాటక మింతగా సాగదు. పాఠశాల యందుఁ బఠించు బాలురలోఁ గలహ్మాస్పియులు నామదికిందట్ట లేదు. సూర్యనారాయణరాజొడొక్కఁడె యట్టివాడని తలంచి యుంటిని, అతఁడు నీనడుమ దుర్వినీతుఁడై యిచ్చకు వచ్చినట్లు మెలంగు చున్న వాఁడని మిత్రులు సెక్కండ్రు, నాతోడ మందలించిరి, మనకేల యాతనిజోలి యని వారికి బదులు చెప్పితిని. ద్రవ్యము, వయస్సు, వీనికిందోడుగా నవివేకత్వము, కొలఁదిగనొ గొప్పగనొ ప్రభుత్వమునను నీనాల్గింటిలో నొక్క డొక్కఁడే యనర్దమును బుట్టించు ననఁగా నీనాలుగు కూడియున్న జెప్పవలసిన దేమని పెద్దల పలుకఁగా వినియున్నాడను. సూర్యనారాయణవర్మ తండ్రి, ధనవంతుడు. ఇతడాతని "కేక పుత్తుఁడు. ఇతనికి వయస్సంకురించినది కోలఁది గ్రామము