పుట:సత్ప్రవర్తనము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

సత్ప్రవార్తనము


అది యుపమండలమున్నా బ్రఖ్యాతి గాంచెను. ఉపమండల మును గొందఱు తాలూకాయని వాడుదురు. ఉపమండలాధి కారి సభాభవనమందుఁ గ్రోత్తగాఁగట్టఁబడినది, దానింజూచుచు విసుగు లేక యానందించువా రాచుట్టుట్టులఁ గొందఱు గలరు. మిక్కిలి యెత్తుగా నది యుండును. అందొక భాగమునఁ గోశ స్థానము గలదు. రక్షకభటు లద్దానం గాపాడుచుందురు. అందెవ్వరికిని బ్రవేశము దొరకదు. దాని యధి కారియే యుద్దాని చెంత నుచిత పీఠమునఁ గూర్చుండియుండును. ఆ ధనమును జూచుచునే యుండును, విసుగన్నది యాతనికి లేదనుట విచిత్రము కాదు,

కొంత కాలమున కారుముదపల్లి యందు దొరతనమువారొక పాఠశాలను గట్టించిరి. ముందున్న వానికన్న సది మిన్న యని యెన్ని కంగాంచి యున్నతపాఠశాల యను పేరునఁ బ్రసిద్ధమయ్యెను. ఆపాఠశాల పురమునకు సుంతదూరమునఁ గట్టిరి. అది కట్టిన చోటుముందు సుందరోద్యానముగా నుండెను. వేసవి దినములలో బాటసారులు నగరవాసులు నందుఁ గూరు చుండి బడలికలుడుగ హాయి చెందువారు. దాని ముందొక బాటగలదు, నచ్చువారు పోవువారు విరామము లేక యుందురు. ' వారెల్ల రా తోటలో నించుక కాలము గడుపుచుండు వారలే యనవచ్చును. అందుఁ గూరుచున్న సూర్యరశ్మి, దృగ్గోచర మగుట కష్టమే. ఫలవృక్షములు, పుష్పలతలు మెండుగా నండుండును. కక్కూఱితికి లోనై ఫలములు కోసికొనిన సందున్న కొవలివారేమనరు. ఏకాలముననైనను ఫలము లేవో యందు దొరకును, పండ్రెండు నెలలు పొంథులకు: ధృప్తి చేయవలయుననియే ధర్మాత్ము లుద్యానములను మార్గముల