పుట:సత్ప్రవర్తనము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవార్తనము


దాని లెక్క చేసుకున్న సౌదర్యము శూన్యమగును. "కావున జాతిగౌరామును గా పొడుకోనుటకంటే గర్తవ్యము వేరొకఁడు కానరాదు. ఈవిషయ మా గ్రామమున నుండు భూపులకుఁ జక్కగా దెలియును, ధనము గల్గిననే గౌరవము నిల్చునన్న యూహ మంచిది కాదని వారలనిచ్చితము. కావున వారు యదృచ్ఛాలాభ సంతుష్టులై యుండిరి. వైశ్యులు ధన పంతులు కులవృత్తి జీవించువారు, దేశాంతరములకుంబోయి బేహారము సాగించి యపొకథనము నార్జించిన వారందు 'బెక్కండ్రు గలరు. ఉన్న తావుననే వ్యాపారము చేసి కొంత ధనము సముపార్జించిన వారు కొందఱుం గలరు. మొత్తము మీఁద వా రెల్ల "ధనసంతులనియే ప్రసిద్ధిని గాంచిననుటకు శంకయే లేదు. అత్యల్పసంఖ్యాకులు దరిద్రులున్నను వారును ధనవంతులవరుసలోఁ బరిగణించ బడుచుండిరి.

క్షత్రియ బాలురు విద్యయు, దానికి సమానముగా ధనుర్విద్యయు నేర్చుకొను వారు. వైశ్య బాలురు వ్యాపారోచిత విద్య నభ్యసించువారు. ఈయాచారము బాల కాలమునుండి వచ్చుచుండెను. అన్న వస్త్రములకుఁ గొఱత లేక తక్కినజాతుల వారును, నెమ్మదిగ నేయుండిరి, విద్యావిహీను లాకనక పల్లి యందు లేరన్న విఖ్యాతి మాత్రము లోకమున వ్యాపించెను. యాచకులు ప్రతిదిన మా గ్రామమునఁ గనఁబడుచుందురు. యథో" చితసత్కారము వారలకు జరుగుచుండునని యూహింప వచ్చును. సత్కారమున కించుక కొఱామ్తగల్గిన వారి రాక కవకాశ మెట్లు! 'పెక్కు వర్షము లిట్లు గడచెను. - కనకపల్లికి దక్కిణ భాగమున నొక పత్తనము గలదు. కుముదవల్లియని దాని పేరు. అందు రాజకీ యోద్యోగులుందురు..