పుట:సత్ప్రవర్తనము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవార్తనము


కడ ఫలభరితతరువర సంకులముగా నిశ్చింతురు. వాని వలనం గలుగు లాభముల వారు గోరరు.

ప్రకృతోద్యానముకూడ నావిధముగనే తొలుత నిర్మించబడినది వారి వంశమునఁ బుట్టిన వారు లుబ్దులై రొక్కమునకు దాని నమ్ముకొనిరి, ఫలవృక్షముల ననలీల గుథార ధారల కాహుతి గానిచ్చి యాచోటున నీపాన శాలను గట్టించిరి. విద్యాశాల యెంత పవిత్రమో యూహింపవచ్చును. పాథశాల చుట్టును గొట్టగా మిగిలిన చెట్లు కొన్ని యుండెను. అందొక భాగమున సరోవరము నిర్మింబడి యుండెను. విద్యార్థుల కది యనర్థానహమ్మని భావించి కాబోలు బానింబూడ్చి నూయిగా మార్చిరి. కమలములు ముచ్చటగా నందుండెను. వాని నెందఱొకోసికొని పోయి భగవంతు నారాధనమున కుపయోగపఱుచుచుండిరి. వారీ కార్యము వలదన్నను వినక 'పాఠశాల సంస్థాపక సంఘమువారిట్లు దాని మార్చిరి.

ఆపాఠశాల నిర్మించిన దాదిగా గనక పల్లియందుండు రాజులు, వైశ్యులు తమ తనయులను విద్యాభ్యాసమునకై యచటికిఁ బంపుచుండిరి. విప్లులు శూద్రులు ధనవంతులు గామి ధనవంతులకే యందు విద్య నభ్యసింప శక్యముగాను దమ బాలురఁ బంపక యుండిరి. ఆ పాఠశాలయందు విద్యనభ్యసించి పరీక్షయం దాఱితేఱిన గొప్పయుద్యోగములు దొరకునను ప్రనాదము క్రమక్రమముగాఁ బ్రబలెను. అందలి విద్యా ర్థులకుఁ గన్ని యలీయఁ బలువురు వచ్చుచుంబోవుచున్న వారన్న "వార్తయు నెల్లరకుఁ దెలియనచ్చేను. ఈ రెండు వినఁబడినతోడనే విప్పులు శూదులును దమతమ బాలరులను 'బాఠశాలకు . బంపసాగిరి. ఉన్న మాన్య క్షేత్రముల నాధి పెట్టి కొందఱును,