పుట:సకలనీతికథానిధానము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3


వ.

అని యిష్ట దేవతా ప్రార్థనంబును బురాతనకవీశ్వరుల నమస్కారంబును గుకవితిరస్కారంబును నాచరించి యొక్క విచిత్రకథాప్రబంధంబు విరచింపఁదలంచి తన్మాతృకార్చనా[1]పరాయణుండనై యున్న సమయంబున.

11


సీ.

ప్రభవించె నేవీటి పర్వతాగ్రంబున
           వరిగిరీశ్వరుడు శ్రీనాయకుండు
వసియించె నేవీటి వర్ణితసాలాంత
           రమున మూలస్థానరాజమౌళి
యుదయించె నేవీటి యుత్తరాశాతట
           భూషణీకృతనింబ పుట్టలమ్మ
వరియించె నేవీటి వలదిశాకోణంబు
           నందు గుబ్బటల మైలారమూర్తి


తే.

వినుతిగాంచిరి యేవీటి విప్రరాజ
వైశ్యశూద్రాది బహువిధవర్ణసమితి
యట్టిపురరత్న మొప్పు భవ్యాంబుజాత
మండితామరతరువల్లి కొండపల్లి.

12


క.

ఇటువంటి కొండపల్లీ
పుటభేదనమంత్రిమకుటభూషణ మరి(రా)
క్కటకవిభేదనఘటనో
ద్భటుఁడగు[2] కుటముక్ల పిన్నభైరవుఁ డొప్పున్.

13


క.

వనితాజనకందర్పుఁడు
ఘనదాన ఘనాఘనంబు కమనీయనిభా
దినకరుఁడు కుంటముక్కుల
పినభైరవమల్లమంత్రి పృథుతరకీర్తిన్.

14
  1. తన్మాతృకాన్వేషణా
  2. పుటభేదనమంత్రిమకుటభూషణ మరిరా
    ట్కటకవిభేదనఘటనోద్భటుఁడగు