పుట:సకలనీతికథానిధానము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

సకలనీతికథానిధానము


క.

గురుశేఖరప్రభావుఁడు
తిరుకులయాచార్యుఁ డాత్మదేశికుఁడన సు
స్థిరకీర్తిసప్తసంతతి
పరుఁడగు పినభైరవుండు ప్రతిదివసమునన్.

15


చ.

సరసకవీంద్రులున్ విబుధసంఘము నాప్తులు నిష్టభృత్యులున్
తరుణులు వందిమాగధులు దత్త్వవిధిజ్ఞులు రాయబారులున్
సరవి భజింప బూర్వనరనాథకథల్ వినువేడ్క మానసాం
బురహమునందుఁ దోచుటయు మున్ను ననుం బిలువంగబంచినన్.

16


క.

ఏనునుఁ దన్మంత్రీశ్వరు
నానతి నాస్థానమునకు నరిగి మనోజ్ఞా
సీనుఁడనై యున్నను[1] బహు
మానముతో జూచి మంత్రిమణి యిట్లనియెన్.

17


సీ.

శ్రీవత్సగోత్రవారిధి పూర్ణశీతాంశుఁ
        డగు కూచిమంత్రికి నాత్మజుఁడవు
వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌఢిఁ
        బూర్వకవీంద్రులఁ బోలినాఁడ
వఖలపురాణేతిహాసకావ్యస్మృతి
        చయము రచించిన చారుమతివి
మాపినతండ్రైన మల్లమంత్రికినిఁ గొ
        క్కోకంబు చెప్పిన కోవిదుఁడవు.


తే.

రసికు లభినుతి సేయఁ బురాణసార
మనుపదంబుగ నాకిచ్చినట్టిప్రోడ
వట్లుగావున నొకటి నిన్నడుగఁ దలఁచి
యిచ్చటికి బిల్వబంచితి నెఱ్ఱనార్య!

18
  1. సీనుఁడనైన ననున్ — సమంజసముగా కన్పించుచున్నది.