పుట:సకలనీతికథానిధానము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

సకల నీతి కథానిధానము


క.

వాల్మీకిఁ దలతు నపగత
కల్మషరఘురామ కావ్యఘటశీలుం బు
ణ్యోల్మ ? విహీనుం బ్రజ్వలి
తోల్ముకనిభనేత్రు బ్రహ్మయోగపవిత్రున్.

5


క.

వేసరక గొల్తు నిగమా
భ్యాసుని శ్రీరమణపాదపంకజసేవా
వాసున్ ముక్తీ ? పురపద
వీసంచరదృష్టివాసు వేదవ్యాసున్.

6


క.

భారవిని గాళిదాసున్
చోరున్ జయదేవు మాఘు సూర్యకవీంద్రున్
బేరెన్నికగల సంస్కృత
సారకవీశ్వరులఁ దలతు సజ్జనఫణితిన్.

7


చ.

వినుతి యొనర్తు వాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టుఁ దిక్కయ
జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా
చనసుతు సోము భాస్కరుని జక్కయనుం[1] గవిసార్వభౌమునిం
వనరుహపుత్రసన్నిభుల వర్ణిత కావ్యకళావిధిజ్ఞులన్.

8


ఉ.

నూతనశబ్దబంధములు నోటికి శక్యముగాక బొంతగా
బాతులుగూయు కైవడిని పాఁచి కవిత్వము లల్లి వాడలన్
గూఁతలు గూయు దుష్కవులకు వశమే కరఁగింప నీటిపై
వ్రాతలువోలె బోవు కవివైఖరులున్ విలసిల్లనేర్చునే.

9


క.

సుకవులు చెప్పిన కవితా
నికరములు శిలాక్షరముల నిలుకడ గాంచున్
గుకవులు చెప్పిన కవితా
నికరములు జలాక్షరముల నీచత నణఁగున్.

10
  1. జెన్నయుని అని పాఠాంతరము