Jump to content

పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38


ఆవులు గోవులు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెలు వేసేటి వేళ
సంధింటిదీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
అన్నల్లందలా లెక్కేటి వేళ
బావల్లు పల్లకీ లెక్కేటి వేళ
తమ్ముల్లు తాంబూలం వేసేటి వేళ
మరుదుల్లు మరిజూద మాడేటి వేళ
కూతుళ్లు గుండిగలు దింపేటి వేళ
కోడళ్లు కొటుపసుపు కొట్టేటి వేళ
చెల్లెళ్లు చేమంతులు ముడిచేటి వేళ
వదినెల్లు వంటలు వండేటి వేళ.[1]

  1. పాతపాటలు - రెండోఖండం 'భారతి' 1931 అక్టోబరు,నవంబరు, డిశంబరు, 1932 జనవరి, ఫిబ్రవరి సంచికలలో అచ్చయింది.