Jump to content

పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37


కడవ పంౘల కుయ్యాలి...
కురవాలి కురవాలి...
కుంభవృష్టి కురవాలి...
డబ్బుకు తవ్విడు బియ్యం...
మనిషికిద్దరు పెళ్లాలు...
వానొస్తె వణుకైన...
కురవాలి కురవాలి...
మూడురోజుల యెండ...
ముప్పైరోజుల ముసురు...

83.
[మోచేటి పద్మమ్మ నోములోని సాయంకాల వర్ణనం.]

మోచేటిపద్మమ్మ పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు పూచేటి వేళ
బీరాయిపువ్వులు పూచేటి వేళ
బిందెల్ల వుదకమ్ము తెచ్చేటి వేళ
కాకరాయిపువ్వులు పూచేటి వేళ
కడవలతొవుదకమ్ము తెచ్చేటి వేళ
గుమ్మడీపువ్వుల్లు పూచేటి వేళ
గుండిగలతో వుదకమ్ము తెచ్చేటి వేళ
ఆనపాయివపువ్వుల్లు పూచేటి వేళ
అటిగలతొ వుదకమ్ము తెచ్చేటి వేళ
చిక్కుడాయిపువ్వుల్లు పూచేటి వేళ
చిప్పల్లగంధమ్ము తీసేటి వేళ