ఈ పుట ఆమోదించబడ్డది
36
తల్లాట పడతారు...
తండ్రి లేని బిడ్డలు...
తల్లాట పడతారు...
పసిబిడ్డ బాలకులు...
తల్లాట పడతారు...
చేటంత మబ్బుపట్టి. - -
చెరువంత నిండాలి....
తూరుపున మబ్బుపట్టి....
తుళ్లి తుళ్లి కురవాలి...
పడమట మబ్బుపట్టి...
పట్టి పట్టి కురవాలి...
ఉత్తరాన్ని మబ్బుపట్టి...
ఉరిమి మెరిమి కురవాలి...
దక్షిణాన్ని మబ్బుపట్టి...
జల్లు జల్లున కురవాలి...
ఈగతల్లి నీళ్లాడి...
వీధి వీధి నిండాలి...
దోమతల్లి నీళ్లాడి...
దొడ్డెల్లా నిండాలి...
పాముతల్లి నీళ్లాడి...
పంటచేల్లో తిరగాలి...
కప్పతల్లి నీళ్లాడి...