పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35


81.
వాన దేవుడ నీకు వరస చెల్లెలిని
వర్షాలు కురిపించు వరి మళ్లలోను
కురిసింది మావూర కుంభవర్షమ్ము
పండేయి మాచేలు పల్లంపుభూమి
నూర్పించి తెచ్చేరు నూరు గరిసెల్లు
పండించి తెచ్చేరు పంటకాపుల్లు
ఎక్క లేనిగట్టు దిగలేని మెట్టు
చూలింతలు పోసేరు చుక్కల్లపొడుగు
బాలింతలు పోసేరు పర్వతాలపొడుగు
నూనెతో పులగాలు మాయెడ్లు మేసె.

82.
పన్నెండుధాన్యాలు వాన దేవుడా
పంటమీద పండాలి వాన దేవుడా
పన్నెండుధాన్యాలు...
పంట చేలుపండాలి...
మాకడుపు నిండాలి...
పేదసాద బతకాలి...
కూలినాలి దొరకాలి...
పారిపోయిన బావ...
పరిగెడుతు రావాలి...
ఊరికెళ్లిన బావ....
ఉరికురికి రావాలి..
తల్లి లేని బిడ్డల్లు...