పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పా త పా ట లు

మూడో ఖండం

[1]



1.
ఇసుకలో ఆడేటి కుసుమసిరి బాల
ఆబాలపేరేమి ఆనవాలేమి
ఆనవాలు అంబరస పేరు బాలయ్య.
2.
రమణయ్య చేతుల్లోది వజ్రాలగిలక
చూచిరా ఆ యెలక చూరున్న పెట్టె
వాసాల బారేటి మీసాలయెలక
పాపకారియెలక పారెయ్యి గిలక
దోసకారియెలక దులిపెయ్యిగిలక.
3.
పంచదారకుప్ప పాలమీది తెప్ప
మాకు మా వెంకట రమణయ్య ముద్దు
వరహాలకుప్పందు వచ్చె ధనమందు
మామసత్యం తెచ్చె మాణిక్యాలకంటె
అత్తసీతమ్మ తెచ్చె అద్దాల అంగి
వెన్నారిముద్దందు వెలగపండందు.
4.
వెలదిరో! వెంకటరమణ యెవరిపట్టందు
కాంతరో! వెంకటరమణ కన్నతల్లందు

  1. ఈ పాతపాటల నేను సికిందరాబాదులో 1931 వ సం॥ ఏప్రిల్ మాసంలో సేకరించాను.