పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34


మొగ్గల్ల చెర్లోకి నీళ్లుచేరేయి
మొహముకడుగ మీకు వేళాయె లెండి."

77.
బూరుగ పూసింది బారువనంలో
................................

78.
కోటసింగరాజు మాటవాసికైన
గంగమాంబచేత గుణుతికెక్కె
గంగమాంబ ఎంతొగయ్యాళియైతేను
సింగరాజు యేమి చేయగలడు.

79.
వంకాయ వండేను వరికూడు వండేను
తినమని చెప్పవే తడికా తడికా,
వగలాడి మాటలకు వళ్లంతా మండింది.
వద్దనీ చెప్పవే తడికా తడికా,
పట్టుచీర తెచ్చేను పెట్టిలోను పెట్టేను
కట్టుకోమని చెప్పవే తడికా తడికా.
................................

80.
గడపలలోకల్ల యేగడప తీరు
మహలక్ష్మీ వసియించు మాగడప తీరు,
వీధులలోకల్ల యేవీధి తీరు ?
విద్వాంసులు నడచిన్న మావీధి తీరు,
అరుగులలోకల్ల యే అరుగు తీరు ?
పండితులు కూచున్న మా అరుగు తీరు.