పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33


69.
మొండికెత్తినదాన్ని మొగుడేమి చేసు
లజ్జమాలినదాన్ని రాజేమి చేసు
సిగ్గుమాలినదాన్ని శివుడేమి చేసు.

70.
అమ్మనాడెరగనే వుయ్యాల
అబ్బనాడెరగానే వుయ్యాల
మొగుడునాడెరగనే మోకులుయ్యాల.
 
71.
చూచీది కళ్ళమ్మ వాచీది మొహం
నీ కేమికలుగునే నిర్భాగ్యురాల

72.
ఏకాసివచ్చింది రాకాసిలాగ
బ్రాహ్మల్లపాలింట పెనుభూత మాయె.

73.
తోడికోడలు నాకు తోడాయె నమ్మ
దొంగతిండ్లకు మాకు సందాయె నమ్మ.

74.
ఊరు మంచిదని వుబ్బకురా అబ్బ
ఊళ్ళోను దీపమ్ము పెట్టిన్నదాక
ఆలిమంచిదని వుబ్బకురా అబ్బ
ఆయింటికాపరం చేసిన్న దాక.

75.
సంపత్తుచేతనే చావతీరాదు
యముడిక్కి చెప్పండి రాతీరదాని.

76.
చుక్క తెల్లవారె తూర్పు తెల్లవారె.
తులసెమ్మ పెనిమిటిని యేమన్ని లేపు.
“కలవల చెర్లోకి నీళ్లు చేరేయి
కాళ్లుకడగ మీకు వేళాయె లెండి.