పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


4. ప్రా పం చి కో క్తు లు



48.
ఒంట పుట్టిందమ్మ వుగ్రంపు తెగులు
అడవిమందులుతిన్న అది కుదురదాయె.

49.
అమ్మపెట్టిన్న అన్నమ్ముకన్న
భార్య పెట్టిన బలుసాకుమేలు.

50.
పెళ్లామంటే బెల్లమురా
తల్లి అంటే దయ్యమురా.

51.
అత్త లేనికోడ లతిముద్దరాలు
కోడలులేనత్త గుణవంతురాలు.

52.
హింసచేసినవాడె హింస తా బొందు

53.
అడుచుగోనుపోడుచుగోను ఆడవారివంతు.
కూచునిభోంచెయ్య మొగ వారివంతు.

54.
దంచక్కనలగవే ధాన్య రాసుల్లు
వంచక్కవంగరే వనితకోడళ్లు.

55.
ముద్దుచేసిన కుక్కమూతినికరచె
చనువుచేసిన ఆలి చంకనుయెక్కె.

5. ప్ర కీ ర్ణా లు



56.
కన్నతల్లినిబోల లేరు చుట్టాలు
పట్టుచీరను బోలలేవు చీరల్లు