పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31


పరమాత్మ నిను బోలలేరు చుట్టాలు
వెల్లచీరను బోలలేవు చీరల్లు
వేదము నినుబోల లేవు చదువుల్లు.

57.
తాతగారింటనే తూతూల పెళ్లి
బూరిముక్కడుగుతే బుగ్గ పొడిచేరు
గారిముక్కడుగుతే కసరికొ ట్టేరు
అరిసిముక్కడుగుతే అదిమి తన్నేరు

58.
ఏకేకు బార ఎల్లుండి సంత.
.....................................

59.
రోక లెత్తలేను రోలెత్తలేను
చేమపూ కడియంపు చెయ్యెత్తలేను.

60.
నో రెంగిలాయెనే చెయ్యెంగి లాయె
చెయ్యికడుగ నీళ్లియ్యి చెల్లె లమ్మాయి.

61.
కూకుంటె లెగలేడు కూరాకు తెంపలేడు
కొట్టొస్త డోలప్ప సిగ్గొస్తది.

62.
కూడు తింటావా తమ్మా ?
కూకుండే వున్నా నమ్మా,
అంబలి తింటావా తమ్మా ?
అమిరే వున్నా నమ్మా,
గడ్డి కొస్తావా తమ్మా ?
గడియుండొస్తానమ్మా