పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29


చేడెరో అబ్బాయి పుట్టేడు మొదలు
చేడె అమ్మికొంగు చేతుల్ల మాసు.

42.
అరణాలు లేవు ఆవటి కట్నాలు లేవు
అతివ నీ అత్తింట నోరెట్టుకు బతుకు.

43.
అళ్లువిసరంగ వచ్చెచుట్టమ్ము
ఆళ్ల తిరగలిచూచి ఆశ్చర్యపడెను
చోళ్లువిసరంగ వచ్చెచుట్టము
చోళ్ల తిరగలిచూచి చోద్యముపడెను.

44.
చక్కన్ని దానివే చదరాలనీవు
ఒక్కర్తెవున్నావు ఈఅడవిలోను.

45.
వేరింటికాపురం కూతుర కూతుర
వెర్రి మొగుడే కూతుర కూతుర
ఎద్దరి (డి ?) నీళ్లే కూతుర కూతుర
ఏరుపిడకలే కూతుర కూతుర
ఇసకలపొయ్యే కూతుర కూతుర.

46.
ఆవాలపప్పు వండ ఓవొదినెనేర్తు
ఆరని అగ్గులు పెట్ట ఓవొదినెనేర్తు
మెంతులు పప్పువండ ఓవొదినెనేర్తు.

47.
కోడలా కోడలా కొడుకు పెళ్లామ
కొడుకు వూళ్లో లేడు మల్లె లెక్కడివి?