పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25


27.
యజ్ఞోపవీతం యేగానిబెల్లం
బుజమెక్కు జంజం బుజమెక్కు జంజం.

28.
ఒంటిపిల్లి రాకాసొకచోట
ఇద్దరు ముగ్గురు ఒకచోట

29.
ఆడతారీ బొమ్మ పాడతారీ బొమ్మ
నక్కేరు చెట్టుకింద బొక్కేరుబొమ్మ
తోలుముక్కవున్న తైతక్క బొమ్మ
బొమ్మా, బొమ్మా - బొమ్మా, బొమ్మా.

30.
నాచేతిమాత్ర
వైకుంఠ యాత్ర

31.
సూరీతా పిల్లి
మారీతా పిల్లి
పడమటక్కల్లార పారిపొండి

32.
ఓయి వోయి నాయడా
వంగపళ్ల నాయడా
నక్క పాలు పితికినావు
చిక్కాన పోసినావు
జోడు గుర్రమెక్కినావు
బొమ్మలాట లాడినావు.

33.
కధ కధ కంగు
మాతాత చెంగు
నూనె పోసుకుని దిగమింగు,