పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

24


కుండో కుండ,
కుండనిండా కందులు
రంగసాని బొందులు 2

పీటమీద పిండి పిసుక్కు తినరా
కొమ్మరటిపండు కోసుకుతినరా.3

చెంబు డటుకులు
దమ్మిడి బెల్లం.4

అక్కలకర్ర ముక్కాలిపీట
కూర్చోవదినా వదినా వదినా. 5

సీమమిరపకాయ చిర్రోచిర్రో
పాతగుడ్డ చిరిగితే వుర్రోపుర్రో
దాని మొగుడు దాన్నికొడితే మొర్రో మొర్రో. 6

చెట్టుకొట్టంగ పాలు కారంగ
నిన్నుకొట్టంగ నీరుకారంగ.7

ఉట్టిమీద పూరగాయికుండ
మెల్లిగాదింపరా మేనత్తకొడకా కొడకా కొడకా.8

బూడిద గుమ్మడికాయ
బుచ్చెమ్మ తలకాయ
నారదబ్బకాయ
నారమ్మ తలకాయ9

26.
సంకురాత్రి పండగొచ్చిం దమ్మలార
చంక లెత్తు గాడం డమ్మలార .