పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

26


3. పణతి పాటలు


34.
ఏరంతవెళ్ళిన్న ఇసుకసన్నంపు
యేరుదాటివచ్చింది యెవరాడపడుచు?
పచ్చన్నికుచ్చుల పల్లకీ యెక్కి
బలగంతొ వచ్చింది యెవరాడపడుచు?
తెల్లన్నికుచ్చుల్ల పల్లకీయెక్కి
తేజముతొవచ్చింది యెవరాడపడుచు ?
నల్లన్నికుచ్చుల పల్లకీయెక్కి
నవ్వుతూ వచ్చింది యెవరాడపడుచు?
ఎర్రన్ని కుచ్చుల పల్లకీయెక్కి
.........................................
పచ్చన్ని కుచ్చుల పల్లకీయెక్కి
బలగంతో వచ్చింది పెద్దన్న వదినె
తెల్లన్నికుచ్చుల పల్లకీయెక్కి
తేజముతొ వచ్చింది చిట్టన్న వదినె
నల్లన్ని కుచ్చుల పల్లకీయెక్కి
నవ్వుతూవచ్చింది చిన్నన్న వదినె
ఎర్రన్ని కుచ్చుల పల్లకీయెక్కి
................బుచ్చన్నవదినె.
35.
వేసంకాలంవచ్చె వలువల్లు చిరిగె
వనిత నీపుట్టింటి వారేలరారు?