పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17


64.
నాచేతిరోకళ్లు నల్లరోకళ్లు
నేపాడిన అన్నల్లు రామలక్ష్మణులు
రామలక్ష్మణులాల్ల రక్షపతులాల్ల
మీరెక్కు గుర్రాలు నీలమేఘాలు
మీచేతి కత్తుల్లు చంద్రాయుధాలు:

65.
ఎవ్వరే చుట్టాలు ఎవరు పక్కాలు
ఎవ్వరే మాపాల కలిగి వున్నారు
మాపాల శ్రీవెంకటప్ప వుండగను
మనసులో చింతేల మరిభయములేల.

66.
సింహాద్రి అప్పన్న గుళ్ల ముందార
పడ్డారె గొడ్రాళ్లు ప్రాణచారమ్ము
ఎందుకుపడ్డారు యేలపడ్డారు
సంతాన మియ్యమని చాలపడ్డారు - సంతాన.
బిడ్డల నియ్యమని ప్రియముపడ్డారు - బిడ్డల.
కుమాళ్ళ నియ్యమని కోరిపడ్డారు - కుమాళ్ళ.
సింహాద్రి అప్పన్నకు ఏమి లంచమ్ము
గుడితిరుగువస్త్రము గుమ్మడిపండు
దాగళ్ళవడపప్పు చండు బెల్లాలు.