పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పాతపాటలు

రెండో ఖండం

1. జోల పాటలు


1.
ఏటచూలింతమ్మ యేట బాలింత
మునియేటకొడుకు తల్లి అబ్బాయిలక్ష్మి.

2.
నిద్రపో అబ్బాయి నిద్రపోవయ్య
నిద్రక్కి వేయ్యేళ్లు నీకు వెయ్యేళ్లు
నినుగన్న తలిదండ్రులకు నిండ వెయ్యేళ్లు.

3.
లాలి లాలి లాలి లాలెమ్మ లాలి
లాలిలో అమ్మాయి రాణిలా వుంది
లాలెమ్మ గుర్రాలు లంకల్ల మేను
అమ్మాయి గుర్రాలు పల్లాల మేను.

4.
చిన్న నా అమ్మాయి చీర కేడుస్తే
నెయ్యవోయి సాలీడ నేత్రానపట్టు
మురున్తు సాలీడు మూడునెలలునేసె
అలుస్తు చాకలి ఆరునెలలు వుతికె
వేడుకతో అమ్మాయి వెయ్యేళ్లుకట్టె

5.
ఊరిముందర చింత వుగ్రంపు చింత
ఆచింత పూచితే మరిచింత లేదు.