పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16


పీటకిందున్నది వరహాలమూట
ఆమూట మాకిస్తె మహమంచిమాట.

57.
కొయ్యతోటకూర కొయ్యక్కచెడెను
కొండంత కాపురం కొండేల చెడెను.

58.
చిచ్చెమ్మ చినగాలి పెట్టు పెదగాలి.
అయ్యోధ్యవీధుల్లొ అణిగెనేగాలి.

59.
చలికి వెరిచినట్లు పులికి నే వెరువ
ఆలికి వెరిచినట్లు అమ్మకీ వెరువ.

60.
పాటల్ల పచ్చడి రాగాలబుర్ర
నిత్తెకయ్యలమారి మొగుణ్ణి పాడింది.

61.
కొడుకుల కననివాళ్ళ కడుపేమికడుపు
కులముద్ధరించన్ని కొడుకేమికొడుకు.

62.
పిడికెడు వితనాలు మడికెల్ల జాలు
వక్కడే కొడుకైన వంశాన జాలు.

63.
కొత్తచింతపండు గోనెల్ల చివుకు
గొడ్రాలివస్త్రాలు పెట్టెల్ల చివుకు
దేవదారుచెక్క చెట్టున్న చివుకు
దేవూడివస్త్రాలు గుళ్లోను చివుకు
రావిచెట్టు చెక్క రంపాన్న చివుకు
రంభ చక్కాదనము దుఃఖాన్న చివుకు
పాతచింతపండు బస్తాల చివుకు
బాలెంతబట్టలు పనుపున్న చివుకు.