పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15



52.
అత్త పోసిన గంజి సత్తువ లేదు
అల్లూడు సిరిపురపు గట్టెక్క లేడు.

53.
కోటీవేలా ధనమైన చాలు
గోపికృష్ణుడివంటి కొడుకైనచాలు
లక్షావేలా ధనమైన చాలు
లక్ష్మణదేవరవంటి తమ్ముడైనచాలు.

54.
విశాఖపట్నాన వీధిగుమ్మాన
వింతరాచకొడుకు బంతులాడేడు
బంతివెళ్లి పాలకొండ సభలోన పడితే
ఇది యెవరి బంతన్ని వివరించె రాజు
గోలకొండవారి గొలుసుల్ల బంతి
పాలకొండవారి పచ్చల్ల బంతి
శ్రీకాకుళము వారి చిత్రాల బంతి
నెల్లూరువారిదే నీటైన బంతి
బొబ్బిల్లి వారిదే బంగారు బంతి.

55.
ఓయి ఓయి ఓయి వడ్డాది రాజ
పొడిచిగెలిచిన రాజ బొబ్బిల్లి రాజు
బొబ్బిల్లి పొడుగాయె కిమిడి కిందాయె
మాడుగులు మనకాయె మళ్లుమీ రాజ.

56.
నరసన్నపేటలో భాగోతులాట
రాజుకూర్చున్నది రత్నాలపీట