పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

14



49.
చింతచెట్టుక్రింద చికిలింతగడ్డి
మెయ్యదుగ మా ఆవు పెయ్యలకన్ని
ఆవుపాలు తెచ్చి పరమాన్నం వండి
కుడువదుగ మా అమ్మి కూతుళ్లకన్ని.

50.
నీలాటి రేవంత నిగ్గుతేలింది.
ఏచేడె కడిగింది యీ చాయపసుపు
పచ్చిపసుపు బావల్ల మరదలాడింది.
అణుప్పసుపు అన్నల్ల చెల్లెలాడింది.
కొట్టు పసుపు కొమాళ్ల తల్లియాడింది.
కొమాళ్ల తల్లియే తాను గోపమ్మ
గొంతి యాడిన పసుపు గోవపూచాయ
అన్నల్ల చెల్లెలే తాను అమ్మాయి
అతివ ఆడిన పసుపు ఆవపూచాయ
బావల్ల మరదలె తాను అమ్మాయి
పణతి ఆడిన పసుపు బంగారుచాయ.

4. ప్ర కీ ర్ణ ము లు



51
దంపు దంపనగానె దంపెంత సేపు
ధాన్య రాసులమీద చేయివేసినట్లు
వంట వంటనగానే వంటెంతసేపు
వదినెల్లు మరదల్లు వాదించినట్లు.