పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1141
ఏనుగమ్మా ఏనుగు
ఏపూరెళ్లిం దేనుగు
ఉప్పాకెళ్లిం దేనుగు
ఉప్పునీళ్లు తాగిందేనుగు
మావూరొచ్చిం దేనుగు
మంచినీళ్లు తాగిందేనుగు.

42
చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగు లెయ్యంగ
పగడాల చెమ్మ చెక్క పందిళ్ళెయ్యంగ
పందిట్లో మా బావ పెళ్లి చెయ్యంగ.

43
బావాబావా పన్నీరు
బావని పట్టుక తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీసెడు గుద్దులు గుద్దేరు
పట్టిమంచం వేసేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులకమంచం వేసేరు
నూరుగుద్దులు గుద్దేరు