పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

12

3. పణతి పాటలు44
చుట్టు చక్కందమ్మ చక్కిలపు చుట్టు
చూలింతచక్కంది ఓ రాచ దేవి !
పండుచక్కందమ్మ పనసయ్య పండు,
బాలింతచక్కంది ఓరాచ దేవి !
ఆకుచక్కందమ్మ తామల్ల పాకు
అయిదువచక్కంది ఓరాచ దేవి !
కొమ్మచక్కందమ్మ గోరింటకొమ్మ
కొమరాలు చక్కంది ఓరాచ దేవి !
పోకచక్కందమ్మ బొబ్బిల్లిపోక
భోగపుది చక్కంది ఓరాచ దేవి !

45
మానుచక్కందమ్మ సంపెంగమాను
మహలక్ష్మి చక్కంది ఓరాచ దేవి !
పువ్వుచక్కందమ్మ దానిమ్మపువ్వు
పూబోడి చక్కంది ఓరాచ దేవి !
పువ్వుచక్కందమ్మ గుమ్మడి పువ్వు
పునిస్త్రీచక్కంది ఓ రాచదేవి !

46.
ఓయి ఓయి ఓయి ఓ కాపుపిల్ల
తాటిమేకచల్ల తాగడేగొల్ల
నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల,
కవ్వాన్ని తిప్పింది కమ్మన్ని చల్ల.