పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

10


36
అబ్బిని కొట్టినకొట్టు వూరెల్లరట్టు
తేరె మా అబ్బాయికి తేనెగాజుల్లు
ముత్యాలబొట్టెట్టి పట్టుచీరగట్టి
ముద్దువచ్చింది మాఅబ్బాయిమోము-ముద్దు,
అద్దమై తోచింది వద్దిమామలకు—అద్దమై.
మేలిమై తోచింది మేనమామలకు-మేలి.
మేనమామలముద్దు మేలిమ్మిముద్దు-మేన.
తాతలకు తమచిన్న అబ్బాయిముద్దు.

37.
చిట్టి నా అబ్బాయి చిరుమొగము చూచి
సిగ్గుపడి చంద్రూడూ పొడవ జాలాడు.

38.
ముద్దులు ముద్దులు ముచ్చి కాయల్లు
అమ్మాయి ముద్దుల్లు గచ్చకాయల్లు.

2. ఆ ట పా ట లు


39.
గుడుగుడు గుంచం, గుండారాగం
పాములపట్నం, పడగారాగం
అత్తారిచెవిలో ముత్యాలేస్తే
బయటికిరావే, పందికొక్కా.

40.
కొంగ కొంగ గోళ్లు
రంగడి చేతి రాళ్లు
నాచేతిపూలు