Jump to content

పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8కళ్ళదీ కాటుక పళ్ళదీ యెరుపు
మావాడ బాలింత అబ్బాయి తల్లి.

28.
తూర్పున్న అబ్బాయి యిల్లుకట్టేడు
దూలాలుమోసేరు దూదిపరుపుల్లు
పడమటను అబ్బాయి యిల్లుకట్టేడు
పట్టెల్లు మోసేరు పాల కావిళ్లు
దక్షిణాన్ని అబ్బాయి ఇల్లు కట్టేడు.
దండెల్లు మోసేరు ధనముపెట్టెల్లు
ఉత్తరాన అబ్బాయి యిల్లుకట్టేడు
................................

29.
తాతల్లు గట్టిన్న ధర్మశాలల్లు
అవ్వల్లు అలికిన అరుగుల్లమీద
ముత్తవ్వలు పెట్టిన ముగ్గులమీద
కూచోర అబ్బాయి కుదిమట్టుగాను-కూ.
ఊచవే అమ్మాయి వుయ్యాలచేరు—ఊచవే.
పాడవే అమ్మాయి బలగ మందర్ని-పాడవే.
ధరణిచే రట్టుకొని తనవార్నిపాడె-ధరణి.
భూమిచే రట్టుకొని పుత్రుణ్ణిపాడె

30.
ఊరీముందర డేర లెవ్వరివి
ఉత్తమ్మ బిరుదుల్ల రాజెవ్వరమ్మ
ఊరీముందర డేరల్లుమావి
ఉత్తమ్మ బిరుదుల్ల రాజు అబ్బాయి.