పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

7బోరుతలుపులకింద పొందై నమేడ ·
ఆమేడ నున్నాయి యిద్దరు హంసల్లు - ఆమేడ,
అయిద్దరు హంసల్ల పేరేమి పేరు - ఆయిద్దరు...
రాచిలుక అబ్బాయి రంభఅమ్మాయి-రాచిలుక.
చిలుకలకు చెలికాడుతానుఅబ్బాయి-చిలుకలకు.
హంసలకు చెలికత్తె తాను అమ్మాయి.
25.
అబ్బాయి మామల్లు ఎటువంటివారు
చెవికిచెవికి బారెడేసి పోగుల్ల వారు- చెవికి.
అంచుపంచెలవారు అంగీలవారు-అంచు.
పట్టుపంచెలవారు పాగాలవారు-పట్టు.
పెసరకాయల వంటి పెదిమెల్ల వారు- పెసర.
కందికాయలవంటి కనుబొమ్మల్ల వారు- కంది.
మిరపకాయలవంటి మీసాల వారు- మిరప,
వారు మా అబ్బాయి మేనమామల్లు.
26.
తామలపాకులవిూద రేకల్లువ్రాసి
తమ్ము డంపినాడె తన ముద్దుమాట
తసముద్దుమా టొకటి దబ్బపండొకటి
“నాచిన్నతమ్ముడు రార అబ్బాయి”.
27.
గోరింటపువ్వువంటి కొడుకు నెత్తుకొని
బాలింతవచ్చింది బావినీళ్ళక్కు.
ఏదేది బాలింత యెంత చక్కందో
మా చిన్నిపట్టుచీర మణవలకు పసుపు