పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6పిల్లలికి పాలోసి పల్లెలికి బంపి
అబ్బాయికి పాలోసీ ఆడుకో బంపు.
20
వీధి నెందరు వున్న విసర దేగాలి
రచ్చ నెందరు వున్న రాదమ్మవాన
నా చిన్న అబ్బాయి వీధి నిలుచుంటే
మొగలిపువ్వులగాలి ముత్యాలవాన.
21
చిలక లాడేనమ్మ హంస లాడేని
పావురా లాడేని పందిళ్లలోన
చిలక నాఅబ్బాయి హంస అమ్మాయి
పావురం కుర్రవాడు పందిళ్లలోన.
22
పిల్లెమ్మకన్నుల్లు బీరపువ్వుల్లు
అబ్బాయికన్నులు కలువ రేకుల్లు
కలువ రేకులవంటి నీ కన్నులాకు
కాటుకలు పెట్టితే నీకు అందమ్ము.
23,
ఏడవకు ఏడవకు వెర్రినాతండ్రి
ఏడిస్తె నీకళ్ల నీరు కారేని
నీళ్ళూను కారితే నే చూడలేను
పాలైన కారవే బంగారుకళ్ళ.
24.
చింత చెట్టుకింద చిటిబొమ్మరిళ్లు
వాటిక్కి వాకిళ్ళు బోరుతలుపుల్లు.