పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

9ఆయి ఆయి ఆయి ఆపదలుగాయి
చిన్న వాళ్ళను కాయి శ్రీ వేంక టేశ
గాయిగాయిగాయి యేదమ్మగాయి
అంగళ్ళ ఆడేటి అబ్బాయిని గాయి
పోలేరమ్మా పొత్తుళ్లుగాయి
పొత్తుళ్ళ నాడేటి అబ్బాయి గాయి.

32.
చిన్నారి పాచికలు మావి లోగిళ్లు
చిన్న బాలా ఆడు చినబాల్లుతోడి
బంగారు పాచికలు మావి లోగిళ్లు
బాలలాడేరు మా అబ్బాయితోడి.

33.
కోటంత దేవుడికి మేటంత పత్రి
బ్రహ్మ ఆయుస్సు నీకు నా బాబు.

34.
జోలల్లుపాడితే జొన్నల్లుపండు
జోలలకు జొన్నబువ్వ నీకు వరిబువ్వ
ఏడ్చేటి అబ్బాయికి ఎర్రావుపాలు
నా చిన్న అబ్బాయికి నల్లావుపాలు.

35.
అబ్బిని కొట్టినకొట్టు ఊరెల్లరట్టు
తేరె మా అబ్బాయికి ముత్యాలబొట్టు
ముత్యాలబొట్టుకీ మూడురేకల్లు
రత్నాలబొట్టుకీ రావిరేకల్లు
వజ్రాలు స్థాపించిన వారి మామల్లు
మాణిక్యాలు స్థాపించిన వారి బాబుల్లు,