Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ సంస్థలు :- ప్రపంచమందు ప్రస్తు తము సుమారు ఎనుబది స్వతంత్ర రాజ్యములున్నవి. ఇవి తమ ఆశయములను సార్థకపరుచుకొనుటకు ఏర్పరచు కొనిన సంస్థలు జాతీయము లని, అంతర్జాతీయము లని రెండురకములుగ నున్నవి. ప్రత్యేకముగ ఏ రాజ్యమున కారాజ్యము — ఇతర రాజ్యముల ప్రసక్తి ఏలాటిదిలేక - ఏర్పరచుకొనిన విజాతీయ సంస్థలు, ప్రతిరాజ్యమందుండు శాసనసభలు, మంత్రుల సభలు, న్యాయస్థానములు మొద లైనవి ఈ లాటివి. ఇట్లుగాక, ఇతరరాజ్యము లనేకము లతో కలసి ఏర్పరచుకొనిన సంస్థలు మరికొన్ని కలవు. అనేక రాజ్యములు కలసి ఏర్పరచుకొనిన కారణమున వీనికి అంతర్జాతీయసంస్థ లను పేరు చెల్లుచున్నది. అంతర్జాతీయ సం స్థ లు సాధింపదలచు ప్రయోజన ములు తాత్కాలికములుగాక దీర్ఘ కాలిక ములుగను, శాశ్వతములుగను ఉన్నవి. వీనిని గురించి గుర్తించతగ్గ విశేషములలో ఇది యొకటి. ఈ ప్రయోజనములు కూడ అన్ని రంగములకు— రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగము లన్నిటికి—చెందిన సాధారణ ప్రయోజనములుగగాని, లేక ఏదో ఒక ప్రత్యేక రంగమునకు చెందినవిగగాని ఉండవ చ్చును. ఈ విభేదమునుబట్టి అంతర్జాతీయ సంస్థల ను సాధారణ (General) సంస్థలని, ప్రత్యేక సంస్థలని (Specialized) రెండువర్గములుగ విభాగము చేయనగును. మానవుల అభ్యుదయమునకై సర్వవిధములు పాటు బడుటకును, యుద్ధముల నివారించుటకును స్థాపింపబడిన "ఐక్యరాజ్యసమితి” యు (United Nations) దాని అంగములును, శాఖలును మొదటివర్గములో చేరినవి, ఆలాగుకాక ఉత్తరములను, వస్తువులను ప్రపంచములో ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు సుకర ముగ పంపుటకై ఏర్పాటు చేయబడిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (Universal Postal Union) రెండవవర్గములో చేరినది. అంతర్జాతీయ కార్మిక సంఘము (International Labour Organisation), ప్రపంచ ఆరోగ్య సంఘము (World Health Organisation), ఆహార, వ్యావసాయిక సంఘము (Food and Agricultu- ral Organisation), అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక, సాంస్కృతిక సంఘము (United Nations Educational, 59 అంతర్జాతీయ సంస్ధలు Scientific, Cultural Organisation) మొదలైనవికూడ ఏదియో ఒక ప్రత్యేక ప్రయోజనమును మాత్ర మే సాధిం చునవి గనుక రెండవవర్గములో చేర్పదగియున్నవి. దీనితోపాటు మరియొక విభేదముకూడ గమనింప తగి యున్నది. ప్రస్తుతము ప్రపంచములో పనిచేయుచుండు అంతర్జాతీయ సంస్థలలో కొన్ని ప్రభుత్వములచే స్థాపింపబడి నిర్వహింపబడుచుండునవి; ఐక్యరాజ్యసమితి, యూని వర్సల్ పోస్టల్ యూనియన్ మొదలైనవి ఈలాటివి. వీనిసంఖ్య సుమారు ఎనుబదియని, చెప్పవచ్చును. మరి కొన్ని ప్రభుత్వములతో జోక్యములేని అనధికారులచే స్థాపింపబడి నిర్వహింపబడునట్టివి. వివిధ రాజ్యములలో ని వర్తకులు, కార్మికులు, వ్యవసాయదారులు, మతప్రచార కులు, శాస్త్రపరిశోధకులు, గ్రంథకర్తలు మొదలైన వారు వారివారి ప్రత్యేకోద్దేశములను నెరవేర్చుకొనుటకై ఏర్ప రచుకొన్న సంఘములు వందలకొలదిగ నున్నవి. అంత ర్జాతీయ వర్తక సంఘము (International Chamber of Commerce), అంతర్జాతీయ కార్మిక సంఘముల సమాఖ్య (International Federation of Trade Unions), దివ్య జ్ఞాన సమాజము (Theosophical Society), అంత ర్జాతీయ రాజ్యాంగవేత్తల సంఘము (International Political Science Association) మొదలైనవి. ఇట్టివి. దీనినిబట్టి అంతర్జాతీయ సంస్థలను అధికార (Governmental) సంస్థ లనియు, అనధికార (Non-governmental) సంస్థలనియు విభాగము చేయవచ్చునని స్పష్టమగుచున్నది. ఇటీవలికాలమున అంతర్జాతీయ సంస్థల సంఖ్య విస్తారముగ పెరుగ జొచ్చెను. ప్రకృతిశాస్త్ర జ్ఞానము విపరీతముగ వృద్ధిగాంచి దాని ఫలితముగ ఆర్థిక, రాజ కీయ, సాంఘిక, వైజ్ఞానిక రంగము లన్నిటియందును రాజ్యము లన్నియు పరస్పరాశ్రయములగుట దీనికి మూల కారణము. రవాణా సౌకర్యములు పెరుగుట; ఆర్థిక స్వయంపోషకత్వము సాధ్యముకాక పోవుట, పారిశ్రా మిక వృద్ధిగాంచిన రాజ్యములు ముడి పదార్థములను ఉత్పత్తిచేయు దేశములపై ఆధారపడవలసివచ్చుట. ఈలాటి మార్పుల మూలమున అనేక విషయములలో అనేక రాజ్యములవారు కలసి పనిచేయవలసిన అవసర మధికమయ్యెను. యూనివర్సల్ పోస్టల్ యూనియన్,