Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు ర్జాతీయ వ్యాపారమునకు ప్రస్తుతముండిన నిరోధములు, అంతరాయములు, తగ్గి అంతర్జాతీయ వ్యాపార విస్తర ణమునకు దారి ఏర్పడు నని అనేకుల అభిప్రాయము. ఆర్థికముగ వెనుకబడియున్న దేశముల ప్రత్యేకావసరము అను గుర్తించి ఆ దేశముల పరిస్థితుల కనుగుణముగ ఆయా దేశములు వ్యవహరించుటకు అవకాశములు కల్పించుట ఈ వ్యాపార సంస్థలోని విశేషము. ఈ కారణమువలన ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశములును, వెనుకబడిన దేశములును, సమానముగ ఈ సంప్రదింపులలో పాల్గొను టకు వీలైనది. కాని రష్యా చైనా దేశము లీవ్యాపార సంస్థలలో పాల్గొనకుండుట గమనార్హము. అంతర్జాతీయ ద్రవ్యనిధి. (International Monetary Fund) :- అంతర్జాతీయ వ్యాపారమునకు అంతరాయము కల్పించిన కారణములలో ఏ దేశమున కాదేశము ఇతర దేశముల ప్రమేయము లేకయే, తన దేశపు కరెన్సీ మారకపు విలువలను నిర్ణయింపబూనుట అని ఇదివరకు సూచింపబడినదికదా ! కరెన్సీ విలువలలో స్థయిర్యము లేనంత కాలమును అంతర్జాతీయ వ్యాపారము ఒడుదుడు కులపాలు కాక తప్పదు. అట్టి స్థిరత్వమును సాధించుటకై అంత ర్జాతీయ ద్రవ్యనిధి(International Monetary Fund) 1947 వ సంవత్సరము మార్చినెల మొదటి తేదీనుండి ప్రారంభింపబడి పనిచేయుచున్నది. ఈ ద్రవ్యనిధి నేర్పర చిన సభ్యదేశములు తామావాటికి నిర్ణయించిన తమతమ కరెన్సీ విలువలను పరస్పరానుమతిలేక మార్చకూడ దనుట నిర్ణయము. ఎగుమతి దిగుమతులకు తాత్కా లికముగా పొత్తు కుదురని కారణమున, ఏ దేశమయి నను ఇతరదేశములు చెల్లింపవలసినంత విదేశపు కరెన్సీ లను సేకరింపలేని యెడల, నిధినుండి ఋణము తీసి కొనవచ్చును. ఈ ఏర్పాటువలన తమకష్టము తొలగనిచో ఎగుమతి దిగుమతులకు పొత్తుకల్పించుటకు తమదేశపు కరెన్సీ విలువలను తగ్గించుట (Devaluation) మొదలగు చర్యలను తీసికొనవచ్చును. ఈనిధి నియమములు వివిధదేశముల ప్రత్యేకావసర ములను దృష్టిలోనుంచుకొని నిర్ణయింపబడినవి. కరెన్సీ విలువలలో మాటిమాటికి మార్పులు జరుగకుండ చేయు టయే దీని ప్రధానాశయము. ఇది వ్యాపారపు టొడం 58 బడిక కాక, క రెన్సీవిలువల విషయమై చేసికొన్న నిర్ణయ మైనను అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు దోహద మిచ్చు ప్రయత్నమగుటచే, ఒకదృష్టితో చూచినయెడల అది అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడిక యే యగును. పియి ఆర్థికమాంద్యము ప్రారంభమయిన అనంతరమున ఉక్కు, రబ్బరు, టీ, పంచదార మున్నగు సరకుల 'గిరాకీ' తగ్గిపోయినది. ఉత్పత్తి యథాపూర్వకముగ సాగుచుండిన కారణమున ధరలు విపరీతమయినవి. ఉత్పత్తిని తగ్గించి తక్కువసరకును అమ్ముట ~ ఆదాయము కంటె, ఎక్కువసరకును ఉత్పత్తిచేసి విక్రయించుటవలన వచ్చు ఆదాయము తక్కువ. ఆ కారణమున ఆయా సరకుల నుత్పత్తిచేయు దేశములు తమతమ ఉత్పత్తి పరి మితులను నిర్ణయించుటకు తీర్మానించినవి. అట్టి నిర్ణ యములు ఉక్కు, రబ్బరు, టీ, పంచదార పరిశ్రమల విషయమున జరిగినవి. ఈ నిర్ణయములు చేసికొనిన సభ్య దేళముల ప్రభుత్వములు ఈ సంప్రదింపులు, నిర్ణయములు జరుపుట ఇందలి వైశిష్ట్యము. అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికలవలన వ్యాపా రము సహజమార్గమునగాక కృత్రిమమార్గముల జరుగును. తత్ఫలితముగ అంతర్జాతీయ వ్యాపారము క్షీణించును అనుటలో వివాదములేదు. ఈ నాడు సుదూరముననున్న దేశములందే ఉత్పత్తియగు వస్తునంచయమును మనము అనుభవింపగలుగుట, అంతర్జాతీయ వ్యాపార మూలము ననే. ఈ వ్యాపార మెంతగా వృద్ధినొందిన ప్రపంచ దేశము లందలి ప్రజల జీవితసౌభాగ్యము అంతగా విలసిల్లును. అంతర్జాతీయ వ్యాపార నిరోధకము లగు వర్తకపు టొడంబడికలు అట్టి అవకాళములను తగ్గించునని వేరుగ చెప్పనక్కరలేదు. అన్ని దేశములందలి ప్రజలు ప్రపంచ మందలి వస్తుసంపదను వీలైనంత అనుభవించుటకు చేయ తగిన మార్గములలో ముఖ్యమయినది ఈ వర్తకపు టొడంబడికలను సాధ్యమయినంతవరకు నిర్మూలించు టయే యగును. ఈ యుద్దేశముతోనే నేడు అంతర్జాతీయ వ్యాపారరంగమున తీవ్రకృషి జరుగుచున్నది. సర్వమానవ ఆర్థికాభ్యుదయమునకు అట్టి కృషి విజయవంతమగుట శ్రేయస్కరము. కె. స.