Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రికా దిగుమతుల పై గల దిగుమతి సుంకములు 48శాతము నుండి 23 శాతమునకు తగ్గినవి. ఈ వర్తకపు టొడం బడికలవలన చాలవరకు ముందుగా సూహించిన యుద్దేశ ములు ఫలవంతములై నవి. దిగుమతి సుంకములు పెరుగుటమాని తరుగుట కారంభించినవి. ఈ పునాది పైననే యుద్ధానంతరకాలమున ఈ సమస్యను పరిష్క రించుటకు వలసిన ప్రయత్నములు జరిగినవి. అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికల చట్టము ఆమోదించిన కాలము నుండియు (1984) అమెరికా దేశము అంతర్జాతీయ వ్యాపారమును పెంపుజేయు వద్ద తుల నవలబించుచు వచ్చినది. అమెరికా 1934 నుండి 1939 వరకు గడచిన కాలములో ఇరువది యొక్క దేశములతో వ్యాపారపు టొడంబడికలను గావించుకొని అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకుగల అంతరాయ ములను నిర్మూలించుటకు గట్టిప్రయత్న మొనర్చినది. యుద్ధ కాలమునందే జరిగిన 'అట్లాంటిక్ ఛార్టరు' అను బ్రిటను అమెరికాల సంయుక్త ప్రకటనమునందు అన్ని దేశములకు వ్యాపారమునందును, ముడిసరకులు సేక రణయందును సమానావకాశములను కల్పించుటకు అనువుగ తీర్మాన మున్నది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు యుద్ధానంతర కాలములోని ప్రయత్నములు :- 1948-45 మధ్య కాల మున బ్రిటను, అమెరికా, కెనడా దేశముల ప్రతినిధులు అనేక పర్యాయములు సమావేశమై సమాలోచనములను జరిపిరి. 1945లో అమెరికాదేశము అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకును, సర్వ దేశములయందును నిరుద్యోగ నిర్మూలనము (Full Employment Policy) నకును కొన్ని సూచనలు గావించెను. ఈ సూచనలను అనేక దేశముల ప్రభుత్వములు పరిశీలించి 1947 సంవత్సరాంతమున 'హవానా' యందు జరిపిన సమావేశమున చర్చించినవి. ఈ సమా వేశమున 56 దేశ ముల ప్రతినిధులు పాల్గొనిరి. 1948 వ సంవత్సరము మార్చి నెలనాటికి "అంతర్జాతీయ వ్యాపార పథక నియ మావళిని(International Trade organization charter) 58 దేశము లొ మోదించినవి. ఈ నియమావళి ననుసరించి అంత ర్జాతీయ వ్యాపారపు టొడంబడికలు రెండు రెండు 8 60 57 అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు దేశములమధ్యగాక అన్ని దేశములును పాల్గొనుటకు అవకాశము కలిగిన యొడంబడికల మూలమున అంతర్జా తీయ వ్యాపార విస్తరణమే, ప్రధానాంకమయినది. అంతి యేకాక 'అంతర్జాతీయ ద్రవ్యనిధి' (International Monetary Fund) సక్రమముగసాగి, వివిధదేశములమధ్య ఋణపరిష్కారము నిర్నిరోధముగ జరుగవలయుననిన ఇట్టి యొడంబడికలు అవసరమని గుర్తింపబడినది. వ్యాపారమును, దిగుమతి సుంకములనుగురించిన సాధా రణసమ్మతి (General Agreement on Trade and Tariff లేక Gatt) : పై ప్రయత్నముతోపాటు వాణిజ్యసమ్మతుల చట్టము (Trade Agreements Act) క్రింద అమెరికా, 1947లోనే, 15 దేశములతో సంప్రదింపులు ప్రారంభించెను. ఆతరువాత మరి 8 దేశములు కూడా ఈ 'జినీవా' సంప్ర దింపులలో పాల్గొనినవి. ఈసంప్రదింపులలో ఒక ముఖ్య విశేషముగలదు. సంప్రదింపులు రెండుదేశముల మధ్య జరుగును. అందు ఒక దేశము తాను రెండవదేశమునుండి దిగుమతి చేసికొను సరకులపై గల నిర్బంధములను తొల గించుటకు గల అవకాశములను పరిశీలించి, తన అంగీకార మును తెలుపును. అట్లు తాను తొలగించిన నిర్బంధముల వలన కలుగులాభము, సంప్రదింపులు జరిపిన రెండవదేశ మే కాక, సమా వేశములో పాల్గొనిన అన్ని దేశములకును గలుగును. అట్లు 1947 వ సంవత్సరము అక్టోబరు మాసాంతమునకు 128 సంప్రదింపులు జరిగి 50,000 సరకులపై గల నిర్బంధములు కొంతవరకు తొలగింపబడినవి. ఈ సమా వేళముల ఫలితములు, వ్యాపారమును, దిగుమతి సుంకములను గురించిన సాధారణ సమ్మతులలో (General Agreement on Trade and Tariff, 1947) పొందుపరుపబడినవి. రెండు సంవత్సరముల తరువాత 1949 లో 'అన్నెసీ ' (Annecy) లో 81 దేశముల ప్రతినిధులు సమావేశ మయిరి. ఆ సమా వేశములవలన కలిగిన ఫలితములుకూడ ఆ తరువాత Gatt లో పొందుపరువబడినవి. ఈ Gatt వలన ప్రపంచ వ్యాపారములో సగము భాగమునకు లాభము కలిగినది, ఈ సమాలోచనములు ఇంకను కొంతకాలమువరకు అప్పుడప్పుడు జరుగుచునే యుండును. ఈ సమాలోచనముల ఫలితముగ అంత