అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు
ఈ విధముగనే వ్యాపారము నందలి ఒడంబడికల వలన కూడా అంతర్జాతీయ వ్యాపారము క్షీణించినది. కామన్వెల్తు దేశములతో ఒడంబడికల ద్వారమున బ్రిటను తన విదేశ వ్యాపారమును హెచ్చించుకొనుటకు చేసిన ప్రయత్నములను ఇతర దేశములు చూచుచు నూరకుండ లేదు. ఆ దేశములు కూడ ఇతర దేశములతో సంప్రదింపులు జరిపి పరస్పర నిర్ణయములు (Bilateral- Agreements) చేసికొనుట కారంభించినవి.ఆ కారణమున అంతర్జాతీయ వ్యాపారము సహజమార్గమున గాక పరస్పర నిర్ణయఫలితమగు కృత్రిమ మార్గమున నడిచినది. అన్ని దేశములును కలిసి, అన్యోన్య సహకారముతో, ఆర్థికమాంద్యమును ఎదుర్కొనియుండినచో అంతర్జాతీయ వ్యాపారము అంతగా తగ్గియుండెడిదికాదు. అట్టి అంతర్జాతీయ సహకారములేని కారణమున ఏ దేశమున కాదేశము తన యార్థికస్థితిని చక్కబెట్టుకొనుటకును, ఎగుమతి దిగుమతులకు పొత్తు కల్పించుటకును విడివిడిగా ప్రయత్నించినందున, కరెన్సీ విలువలలో స్థయిర్యము నశించుట, రెండు రెండు దేశములకు వ్యాపారపు టొడంబడికలు జరుగుట, సామాన్యములయినవి. ఈ విధముగ అంతర్జాతీయ వ్యాపారము తగ్గిపోవుటకు ఈ పద్దతులను ప్రథమ పర్యాయముగ అవలంబించిన బ్రిటనుదే బాధ్యతయని చెప్పకతప్పదు.
జర్మనీ దేశము :- ఆర్థికమాంద్యమును ఎదుర్కొనుటకును, ఎగుమతి దిగుమతులకు పొత్తుకల్పించుటకును. జర్మనీ అవలంబించిన పద్ధతులు అపూర్వములు. ఆర్థిక మాంద్యమువలన కలిగిన నిరుద్యోగ సమస్యను యుద్ధపరికరముల నుత్పత్తిచేయు వ్యాజమున పరిష్కరించినది. అది విషయాంతరము. విదేశ వ్యాపారములో దిగుమతుల అనుమతి విధానము (Import licensing) ను, ఎక్చేంజి కంట్రోలును ప్రవేశ పెట్టినది. అనగా జర్మనీలోనికి విదేశ వస్తువులను దిగుమతి చేసికొనుటకు వ్యాపారస్థులకు ప్రభుత్వానుమతి (License) యుండవలెను. ఎక్చేంజి కంట్రోలు అనగా విదేశములకు ఎగుమతిచేసిన సరకులవలన సంపాదించిన 'విదేశకరెన్సీ' ని, ఎగుమతి వ్యాపారస్థులు ప్రభుత్వాధీనము చేసి, తత్ప్రతిఫలముగ 'జర్మను కరెన్సీ' ని తీసికొనవలెను. ఇట్లు విదేశ వ్యాపారమును క్రమబద్ధముచేయు నధి కారము ప్రభుత్వపరమయ్యెను. ఈ అధికారమును పురస్కరించుకొని జర్మను ప్రభుత్వము ఆగ్నేయ-ఐరోపా దేశములతోను, లాటిన్ అమెరికా దేశములతోను అనేక వ్యాపారపు టొడంబడికలను గావించుకొనినది.ఆ ఒడంబడికలలోని ముఖ్య సూత్రమేమన - ఒక దేశము జర్మనీనుండి ఎంతవిలువగల సరకును దిగుమతిచేసికొనునో అంతే విలువగలసరకును జర్మనీ ఆదేశమునుండి దిగుమతి చేసికొనును. జర్మనీ దేశమునకు తమ సరకులను ఎగుమతిచేయు దేశము లన్నియు తమకు కావలసిన సరకులను జర్మనీ దేశము నుండి దిగుమతి చేసికొనవలసి వచ్చినది. ఈ పద్ధతులను ఇతర పారి శ్రామిక దేశములు తీవ్రముగ విమర్శించినవి. కాని చేయునదిలేక యుద్ధము పరిసమాప్తి యగునంతదనుక వేచియుండక తప్పినది కాదు.
అమెరికాదేశము :- ఆర్థికమాంద్యము నెదుర్కొనుటకు ప్రెసిడెంటు రూజ్ వెల్టు అధ్యక్షుడుగా అమెరికా అవలంబించిన విధానమునకు 'న్యూడీల్' (New Deal) అని పేరు. ఈవిధానము అమెరికా ఆర్థికవ్యవస్థకు తిరిగి స్వస్థత చేకూర్చినది. విదేశ వ్యాపార విషయమున ఇతరదేశములతో వ్యాపారపుటొడంబడికలు చేసి కొనుటకు అధ్యక్షునకు అధికార మీయబడినది. ఇది వ్యాపారపు టొడంబడికల చట్టము (Trade Agreements Act, 1934) గా రూపొందినది.
అమెరికాదేశమున దిగుమతి సుంకముల ద్వారమున దేశ పరిశ్రమలకు, వ్యవసాయమునకు రక్షణ కల్పించుట చిరకాల సంప్రదాయముగనున్నది. ఈ దిగుమతి సుంకములు ఇతర దేశములతో వర్తకపు టొడంబడికలు చేసికొనుట యందు ఆదేశమునకు లాభదాయకమగు నియమములను పొందుపరచుటకు ఉపయోగింపబడినవి. అంతర్జాతీయ వ్యాపారము యొక్క పునర్జీవనమే 1934 లోని వ్యాపారపు టొడంబడికల చట్టము (Trade Agreements Act, 1934) యొక్క ముఖ్యోద్దేశము. ఆ చట్టము ననుసరించి అమెరికా సంయుక్తరాష్ట్రముల అధ్యక్షునకు ఆనాటికున్న దిగుమతి సుంకములను సగమువరకు తగ్గించుటకు అధికార మీయబడినది. అట్లు దిగుమతి సుంకములను తగ్గింపవలెను. ద్వితీయ ప్రపంచ సంగ్రామము నాటికీవిధముగ నిరువది యొక్క వర్తకపు టొడంబడికలు జరిగి అమె