Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేయుట, కరెన్సీ మారకపు విలువలను నిర్ణయించుట, దిగుమతులపై పరిమాణ పరిమితులను (Quantitative restrictions) విధించుట, మున్నగు ననేక మార్గములను అవలంబించి ఎగుమతులను హెచ్చించి దిగుమతులను తగ్గించి రెండిటికిని పొత్తుకల్పింప వివిధదేశములందు ప్రయ త్నములుజరిగినవి. ఈ ప్రయత్నములు ఏ దేశ మున కా దేశ మే ఇతర దేశముల ప్రమేయము లేక ఇతరదేశములపై, తన విధానముల ప్రభావమును లెక్కచేయక, జరుపుటవలన అంతర్జాతీయ వ్యాపారరంగమున అరాజక మేర్పడినది. ఆర్థికమాంద్యము వలన వివిధ దేశములు అనుభవింపక తప్పని చిక్కులతోపాటు ఇతర దేశముల ఆర్థికవిధానముల వలన కలిగిన చిక్కులనుగూడ ఎదుర్కొనవలసి వచ్చెను. రాజకీయ రంగమందువలెనే ఆర్థికరంగమందుకూడ అంత ర్జాతీయ సహకారావసరమును మొన్న మొన్నటి వరకు అనేకదేశములు గుర్తింపనేలేదు. బ్రిటనుదేశము :- ఆర్థిక మాంద్యమువలన కలిగిన విషమ ఫలితములను ఎదుర్కొనుటకు అంతర్జాతీయ వ్యాపారము యొక్క ఒడంబడికల మార్గమవలంబించిన మొదటి దేశము బ్రిటను. 1930వ సంవత్సరమున బ్రిటను దేశమున దిగు మతులకంటె ఎగుమతులు 1030 లక్షల పౌన్లు ఎక్కు వగ నుండెను. ఆర్థికమాంద్యము కారణముగ, 1981 లో ఎగుమతులకంటె దిగుమతులే 1040 లక్షల పౌన్లు అధిక మయినవి. ఈ అసాధారణ పరిస్థితుల నెదుర్కొనుటకు బ్రిటను అనేక పద్ధతులను అవలంబించినది. అందు మొద టిది పౌను మారకపు విలువను తగ్గించుట. తత్ఫలితముగ బ్రిటను ఎగుమతులు హెచ్చి, దిగుమతులు తగ్గినవి. 1932 నాటికి ఎగుమతులకంటె దిగుమతులు 580 లక్షల పౌన్లు మాత్రమే అధికమయ్యెను. మరుసటి సంవ త్సరము రెండును సమానములైనవి. కాని మారకపు విలువను తగ్గించినందువలన కలిగిన లాభమును బ్రిటను ఎంతయో కాలము అనుభవింపలేక పోయినది. 1983 లో అమెరికా దేశము, 1988లో ఫ్రాన్సుదేశము, తమతమ కరెన్సీల మారకపు విలువలను తగ్గించినవి. తత్ఫలితముగ బ్రిటనుకు కలిగిన మదృశ్యమయినది. అంతర్జాతీయ వ్యాపారము ఒడంబడికలు విదేశములతో వ్యాపారముయొక్క ఒడంబడిక లను గావించుకొనుట బ్రిటను అనుసరించిన రెండవ పద్ధతి. 1982 లో బ్రిటిషు కామన్వెల్తు ఇతర దేశములన్ని యు 'అట్టావా' లో సమావేశమై కామన్వెల్తు దేశముల నుండి వచ్చు దిగుమతులపై కామన్వెల్తులో లేని ఇతర దేశములనుండి వచ్చు దిగుమతులపై కంటే తక్కువ దిగుమతి సుంకములను విధించుటకు నిర్ణ యించినవి. ఉదా హరణకు:- జపాను దేశమునుండి ఎగుమతియగు వస్త్ర ములకంటే బ్రిటనునుండి ఎగుమతియగు వస్త్రములకు కామన్వెల్తు దేశములలో రక్షణలభించినది. అట్లే ఇతరము లగు సరకులకును రక్షణము లభించినది. ఇంతమాత్రమే కాక కేవలము కామన్వెల్తు దేశ ములనుండి మాత్రమేకాక బ్రిటిషుసరకులపై విశేషముగ ఆధారపడు ఇతర దేశముల నుండికూడ బ్రిటను ఇట్టి సౌకర్యములను సంపాదింప గలిగినది. కాని ఈ యొడంబడిక లవలన బ్రిటిషుసరకులకు కామ న్వెల్తుదేశములతో వ్యాపారము హెచ్చినను, ఇతర దేశములతో వ్యాపారము తగ్గినది. తుదకిందువలన బ్రిటను లాభమును పొందినదా లేదా యనునది వివాదగ్రస్తమై మిగిలిపోయినది. ఇట్లు అంతర్జాతీయ వ్యాపారములో తనభాగమును అధికము చేసికొనుటకు బ్రిటనుపడిన తాపత్రయము సుఖదముగ నుండినట్లు కన్పించినను అవి తాత్కాలిక ములేయైనవి. ముఖ్యముగ ఇతరదేశములు గూడ బ్రిటను చూపిన మార్గములనే అనుసరించుటతో ఆదేశమునకు తొలుతకలిగిన లాభము మాయమయినది. మరి ఇతరదేశ ములతో సంప్రదింపక, తన కరెన్సీ మారకపు విలువలను తగ్గించి, తన విదేశవ్యాపారమును వృద్ధినొందించుకొను ప్రయత్నములు చేసికొనుట ప్రతి దేశమునకు పరిపాటి యైనది. దానితో కరెన్సీ మారకపు విలువలలో స్థిరత్వము నశించినది. ఇది అంతర్జాతీయ వ్యాపారమునకు బలమైన అంతరాయముగ పరిణమించినది. ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరము అంతర్జాతీయ ద్రవ్యనిధి (Inter- national Monetary Fund) ను స్థాపించునంతవరకు ప్రతిదేశమును తనమారకపు విలువలను తగ్గించుటవలన అది లాభమును పొందుటకు ప్రయత్నించు నను భయము పోలేదు. 55