Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంతర్జాతీయ వాణిజ్యము యైన సంపద ను ఏ విధముగా ఉపయోగించవలెనని యెంచి చూడవలసియున్నది. "క1 "క్ష" అను వస్తువును తయారు చేయుటయందు ఒక దేశము తన సంపదనంతయు. వినియోగించిన యెడల నిజముగా అది "చ" అను వస్తు వును కొలదిపాటిగా కూడ తయారు చేయజాలదు. అది యొక యూనిటు. "చ" అను వస్తువును తయారు చేసి కొన దలచినను "క" యను వస్తువును తయారు చేయు టలో ఒక యూనిటు గాని అంతకన్న ఎక్కువగాని త్యాగము చేయవలసి యుండును. "చ" అను వస్తువును ఒక యూనిటు తయారు చేయు టకు, “క”అను వస్తువు యొక్క 3 యూనిట్లు ఆ దేశము ఆ త్యాగము చేయవలయు నని మనమూహించినచో, ఈ రెండు సరకుల ఉత్పత్తి నడుమ మన మొక నిష్పత్తి నిర్మింప జాలితిమి. దీనినే తారతమ్య వ్యయ నిష్పత్తి యనిగాని, అవకాశ వ్యయ నిష్పత్తి (ఆపర్చూనిటీ కాస్టు రేషి యో) అనికాని అనదగును. ఏలయన ప్రతిదేశము ఒక వస్తువు నెక్కువగను, ఇంకొక వస్తువును తక్కువగను తయారు చేయదలచినపుడు ఒకదానికి బదులుగా మరి యొక దానిని తయారుచేయుటయే జరుగుచున్నది. ప్రత్యామ్నాయపు నిష్పత్తులు వివిధ దేశములకు వేరు వేరుగానుండును. ఉత్పత్తి సాధనములు పుష్కలముగా నుండుట, తక్కువగానుండుట, వాటి భేదముల హెచ్చు తగ్గులు, వివిధ దేశములకు వేర్వేరుగా నుండుట ఇవియే కారణములు, ఈ తారతమ్యములే అంతర్జాతీయ వ్యాపా రము లాభకరము చేయుచున్నవి. "చ" అను వస్తువు యొక్క ఒకయూనిటు తయారుచేయుటకు 8 యూనిట్ల "చ" అను వస్తువును ఒక దేశము కోల్పోవలసివచ్చినచో మరియు "చ" అను వ స్తువు యొక్క ఒక యూనిటు ఏదేని పేరు ప్రత్యామ్నాయపు నిష్ప త్తిగల విదేశమునుండి 8 యూనిట్ల “క” కన్న తక్కువ మార్పిడి నొసంగి తెచ్చు కొనగల్గినచో (రవాణాలకు అగు ఖర్చులు లేవనుకొనిన పక్షమున) ఆ దేశమునకు "క" ను మాత్రమే తయారు చేసికొని 'చ' ను పొందకలుగుటయే లాభకరము. ఈ ప్రత్యామ్నాయపు నిష్పత్తులు ఏ దేశమునందును మార్పుచెందక ఒకేవిధముగా నుండవు. ఉత్పత్తి హెచ్చిన కొలది ఆరోహణ ఫల సూత్రము, అవరోహణ ఫల 54 సూత్రము అను ఆర్థిక సిద్ధాంతములపై ఆధారపడి మారుచుండును. రెండు వస్తువులకు రెండు దేశములకు సంబంధించి నవిగా చెప్పబడిన ఈ అంశములన్నియు రెండుకన్న ఎక్కువ దేశములకు, ఎక్కువ వస్తువులకు అన్వయించు నటులు విస్తరింపనగును. డా. జి. రా. రెడ్డి. అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు : 19. వ. శతాబ్దమున అంతర్జాతీయ వ్యాపారవిషయ మున అనేక దేశములు విచక్షణారహిత సిద్ధాంతమును (The Principle of Non - discrimination) అవలంబిం చినవి. ఈ సిద్ధాంతము ననుసరించి ఏ ఇతర దేశమున కై నను ఇచ్చు వ్యాపారసౌకర్యములను అన్ని దేశములకు వర్తింప జేయవలయునని భావము. దీనిని తొలుత ఆమోదించి ఆచరించినది, బ్రిటను దేశము. ఫ్రాన్సు, అమెరికాలు ప్రథ మమున ప్రతిఘటించియు కాలక్రమమున అంగీకరించి అవలంబించినవి. దానితో ఈ సిద్ధాంతము సర్వామోద మును బొందినట్లయినది. 1928 లో ఆరంభమయిన ఆర్థికమాంద్యము (Economic depression) అంతర్జాతీయ వ్యాపారము నందును, వ్యాపార పద్ధతుల యందును అనేక ములగు మార్పులేర్పడుటకు కారణ భూతమయినది. వ్యవ సాయము ప్రధానముగాగల దేశములందు ప్రథమమున ప్రారంభమై ప్రపంచమంతట నావరించిన యీ ఆర్థిక మాంద్యము అపారమైన ఆర్థిక విచ్ఛిత్తికి మార్గదర్శక మయినది. దీనివలన ఉత్పత్తి తగ్గినది. నిరుద్యోగము బలి సినది; కొనుగోలుశ క్తి క్షీణించినది; అంత ర్జాతీయ వ్యాపా రము మిక్కిలిసన్నగిల్లినది. అనేక ముఖ్య దేశములు, తమ తమ దేశములలో ఉత్పత్తి చేసిన సరకులను ఇతర దేశము లకు పూర్వమువలె ఎగుమతి చేయలేకపోయినందున దిగు మతులనుగూడ తగ్గించుకొనవలసివచ్చినది. ఎగుమతి దిగుమతులకు పొత్తుకల్పించుటకై వివిధదేశ ములు వివిధమార్గములను అవలంబించినవి. అంతర్జాతీయ వ్యాపార విషయములలో ప్రభుత్వములు సంబంధము కల్పించుకొన జొచ్చినవి. దిగుమతి సుంకములను వృద్ధి