Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పై ఉదాహరణమునందు చూపబడినటుల “క” నూలుబట్టల నుత్పత్తి చేయుటయందును, "చ" ఉన్నిబట్టలు తయారు చేయుటయందును శ్రద్ధవహించుచుండగా 'క' 'చ' యను రెండు దేశ ములనడుమ లాభకరమగు వ్యాపారము సాగు చుండినచో, "క" దేశమునకు ఉన్ని బట్టల యెడల "చ" దేశమునకు నూలుబట్టల యెడలగల అపేక్ష విస్తరణశక్తుల ననుసరించి మార్పిడి రేటు ఉండును. "చ" దేశమునకు నూలుబట్టల యెడలగల అపేక్ష విస్తరణశక్తికన్న 'క' దేశ మునకు ఉన్నిబట్టల యెడగల అపేక్షవి స్తరణశక్తి ఎక్కువైన మార్పిడిషరతులు “క” దేశమునకనుకూలముగనుండును. కొన్నీ నూలు బట్టలకుబదులు అంతకన్న యెక్కువ ఉన్ని బట్టలు “క” పొందును. ఇదియే “చ”కును వర్తించును. సనాతన (క్లాసికల్) ఆర్థికశాస్త్రజ్ఞులు వ్యయ మును, శ్రమించినదినములను బట్టియే నిర్ణయించుట వారి యొక్క తారతమ్య వ్యయసిద్ధాంతమునందలి మరియొక లోపము. శ్రమాధార మూల్య సిద్ధాంతమందు వారికిగల నమ్మికయే దీనికి కారణము. ఆధునిక వాదులు ఉత్పత్తి కగు వ్యయమును, శ్రమను బట్టి నిర్ణయించుటలేదు. ఉత్పత్తి సాధనముల యెక్కువ తక్కువ కొలతలను స్ఫురింపచేయునటుల అదనపువ్యయము (మార్జినల్ కాస్టు ఆఫ్ ప్రొడక్షను) సిద్ధాంతపు పరిభాషలో వారే సిద్ధాంతీక రింతురు. దీని ననుసరించి ఒక దేశము సమృద్ధియైన ఉత్పత్తి సాధనముల ఫలితముగ తయారైన సరకులను ఎగుమతి చేసి కొరతగానున్న యుత్పత్తి సాధనములచే తయారు కావలసిన సరకులను దిగుమతి చేసికొనును. అంతర్జాతీయ వాణిజ్యార్థమై సరకు యొక్క ఆవశ్య కత పెరిగి తత్ఫలితముగ కలుగు ఉత్పత్తి పెంపుదల స్థిర ఫలిత సూత్రమునకు లోబడి వర్తించునని రి కార్డో భావించెను. కాని అంతర్జాతీయ పారిశ్రామిక ప్రత్యేకతల వలన ఉత్పత్తి పెరుగుదల ఎల్లప్పుడు స్థిరపరిస్థితిలో నే జరుగదు. ఉత్పత్తి అధికమగుకొలది ఖర్చుతగ్గుచుండినచో తారతమ్య సౌకర్యము హెచ్చుచుండును. కాని ఉత్పత్తి ఎక్కు వగుకొలది వ్యయము కూడ హెచ్చుచుండిన యెడల తారతమ్య సౌకర్యము తగ్గిపోవును. కొన్ని సందర్భము లలో అది అంతరించుటయు జరుగును. అట్టి సరకులపట్ల అంతర్జాతీయ వాణిజ్యము ఆగిపోవును. అంతర్జాతీయ వాణిజ్యము రెండు దేశములనడుమ ఉత్పత్తికగు వ్యయములో తేడా కనుపించినచో అది ఆయా ప్రాంతములలోనున్న ఉత్ప త్తిసాధనముల కొలతను తెలియ జేయునను అంశమును మనస్సునం దుంచుకొనినచో రికార్డో పరిశీలనములను ఆధునిక సిద్ధాంత ములతో అన్వయింపగలము. ఫలిత మేమన, ప్రతిదేశము తన ఉత్పత్తిసంపద ఏసరకులను తయారు చేయుటకు హెచ్చు పుష్కలముగా అవకాశమున్నదో ఆసరకులనే తయారుచేయును. ఏ ఉత్పత్తి సంపదయందు కొరతగలదో ఆ ఉత్పత్తి సంపద నుపయోగించి తయారు చేయు వస్తువుల ఉత్పత్తిని తగ్గించి వేయును. అంతర్జాతీయ ఉత్పత్తి ప్రత్యేకతల విషయములో నిది చాల ప్రాముఖ్యముగల అంశము. తారతమ్యవ్యయ సిద్ధాంతముయొక్క నిజస్వభావము :- వ్యయము అనుమాటకు అర్థములు అనేకములు. తార తమ్యవ్యయ సిద్ధాంతమునకు అర్థము చెప్పునప్పుడు ధన రూపక మైన వ్యయమునే మనము సూచించితిమి. వివిధ ప్రాంతముల నడుమ ఉత్ప త్తికగు ధనవ్యయములో తార తమ్యములే అంతర్జాతీయ వ్యాపార గమనమును నిర్ణ వ్యాపారగమనమును యించునను విషయము యదార్థమే. కానీ ధనరూప వ్యయమున సరకుమార్పిడి సంబంధములే ప్రతిబింబించును. ఏమైనను వ్యయము కొంతవరకు అంతర్జాతీయ వ్యాపార ఫలితమే. ఏలయన అంతర్జాతీయ వ్యాపారము లేనిచో కొన్ని దేశములందు ధనరూపవ్యయము వేరుగానుండును. రికార్డో దృష్టిలో నిజమైన వ్యయము శ్రమవ్యయమే. శ్రమ విభిన్నతలేని ఒకే ఉత్ప త్తిసాధనగా పరిణమించు టపై అతని సిద్ధాంతము ఆధారపడియున్నది. ఉత్పత్తి వ్యయము వివిధ తెగలకు స్థాయీలకు చెందిన పెక్కు విషయములపై ఆధారపడును. ఇందు కొన్ని యంళ ములు నిర్దుష్టమైనవి. తక్కినవి బహుళ ఉపయోగములు గలవి. వాస్తవమైన సిద్ధాంతము ఈ అంశములన్నిటినీ గమనించవలెను. తరతమ మార్పిడి సంబంధముల నిశ్చయిం చునవి భేదములు, తెలియజేయు వ్యయములు లేక అవకాశ వ్యయములు. ఈ ఖర్చులకు, కారణము ఉత్పత్తి కవసర మగు సంపద దానిపై గల అపేక్షతో పోల్చినపుడు ఏ దేశ మందయినను కొరతగా నుండుటయే. కావున ఆ కొలది 58