Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ వాణిజ్యము తారతమ్య వ్యయ సూత్రము విదేశ వ్యాపారమునకు మాత్రమే వర్తించుననుట పొరపాటు. ఒకేదేశమందు వివిధజిల్లాల యొక్క ప్రత్యేక ఆధిక్యములననుసరించి ఆ జిల్లాలనడుమ వస్తువులమార్పిడి జరుగుచుండును, ఉత్పత్తి యొక్క అన్ని శాఖలయందును ఏదైనా జిల్లా తక్కిన జిల్లాలకన్న ఎక్కువ ఆధిక్యమును కలిగియున్న యెడల, కార్మికులు పెట్టుబడి తక్కువ జిల్లాలనుండి ఈజిల్లాకు వలసపోయి ఉత్ప త్తిలో పాల్గొని లాభమును పొందుట జరుగును. ఒక దేశమందైనను, ఒక స్థిరనిశ్చల పరిస్థితి పొందునటుల శ్రమ, పెట్టుబడిపోకడ సాగింపజాలవు. రెండుజిల్లాలనడుమ అట్టి స్థిరనిశ్చలత్వము ఏర్పడనంతవరకు సరకులమార్పిడి జరుగుచునే యుండును. a దేశాంతర్గత వ్యాపారములలో కూడ శ్రమ, పెట్టు బడుల గమనము అడ్డంకులతో కూడిన విషయమే. విదేశ వ్యాపార విషయములో ఈ గమనము మరింత బాధా కరము. జె. ఇ. కైర్న్ మహాశయుడు పేర్కొనినట్లు పెట్టుబడిని, కార్మికులను పోటీలేని వర్గములమధ్య మార్పు చేయుట అంతర్జాతీయ వాణిజ్యమందు మనము యోచించ వలసిన విషయము. ఈ యుత్పత్తి సాధనములు అంత ర్జాతీయ సరిహద్దులగుండ ప్రయాణించుటకు అనుకూల మైనవికావు. రికార్డ్ల్లో ప్రధమమున తారతమ్య వ్యయ సిద్ధాంతమును ప్రవచించిననాటినుండి అంతర్జాతీయముగా ఉత్ప త్తిసాధనముల స్వేచ్ఛాగమనము ఎంతయో సులభ మాయెను. కాని దేశాంతర్గత గమన మంతగా కాదు, సిద్ధాంతమునే తలక్రిందుచేయునటులు అంతకన్నను కాదు. సరకులు దిగుమతి చేసికొన్న దేశములు ఎగుమతిచేయు ప్రాంతముల అంతకన్న తక్కువ శ్రమ పెట్టుబడులతో ఆయా సరకులు తయారుచేసి కొనగలిగినను అంతర్జాతీయ వ్యాపార మార్గములద్వారా అనేకములగు సరకులు గమించుచున్నవి. ఆ సరకులు దిగుమతి చేసికొనుటకు కారణము దిగుమతిచేసికొనుచు దేశములకు ఇతర వస్తువు లను తయారుచేయుటయందు ఇంకను హెచ్చగు ఆధిక్య ముండుటయే. ప్రతిదేశము ఒక సరకును ఏదేని ఒక విదేశముకన్న తక్కువ ఖరీదుకు ఉత్పత్తిచేయగలిగినంత మాత్రమున దానిని తప్పక తయారుచేయుననుట కాక, మిక్కిలి హెచ్చగు లాభసాటి అవకాశములకు మిక్కిలి 52 తక్కువయగు లాభసాటి ఖర్చులకు తయారుచేయగల సరకులనుమా త్ర మే ఉత్పత్తిచేయుననుటయే అంత ర్జాతీయ వాణిజ్యమునకు సంబంధించినంతవరకు తారతమ్య వ్యయ సిద్ధాంతము. ఏ ఏ సరకులను ఉత్పత్తిచేయుటయందు తన ఆధిక్యము సుస్పష్టములేక ఏయే సరకులను ఉత్పత్తి చేయుటయందు తన అసామర్థ్యము హెచ్చుగా 'కాన రాదో అట్టి సరకులనే ప్రతిదేశము తయారుచేయును. ఈ సూత్రము దాని పునాదులయిన శ్రమవిభజనము, పరి శ్రమల కేంద్రీకరణము అను ఆర్థిక సిద్ధాంతములు అమలు జరిగిన కొలది ప్రపంచమందంతటను ఉత్పత్తి ఆర్థిక సామ ర్థ్యము వృద్ధినొందదు. ప్రతి వ్యక్తిని సంక్రమించు భాగముకూడ హెచ్చగును. • పరిమితులు :- సరకులు ఉత్పత్తియందు తారతమ్య వ్యయభేదములున్నంతవరకే రెండు దేశముల మధ్య వ్యాపారము సాగునను రికార్డో సిద్ధాంతము సత్యమే. కాని రికార్డ్లో ప్రవచించిన రూపమున అది వెక్కు అంశములలో అసంపూర్ణము, తారతమ్య వ్యయములు అంతర్జాతీయ వ్యాపారములోనికి వచ్చుసరకుల జాబి తాను మాత్రమే నిర్ణయింపగలవు కాని మార్పిడి షరతులను అనగా ఎన్ని సరకులు దిగుమతి చేసికొన బడునో ఎన్ని సరకులు ఎగుమతి చేసికొనబడునో మార్పిడి అగునది ఎన్ని సరకులు అను విషయమును నిశ్చయింపవు. 'క’అనుదేశమునకు సూలుబట్టలు తయారుచేయుటయందు ఎక్కువ లాభసాటియగు అవకాశములు కలవు, కావున వానిని ఉత్పత్తి చేయుచున్నచో "చ" అను దేశము అశ్లీ ఉన్ని బట్టలను తయారుచేయుచున్నచో ఏసూత్రము ననుస రించి ఆ రెండుదేశములు తారతమ్యవ్యయ సిద్ధాంతమును అమలుజరుపుట వలన వచ్చినలాభములను పంచుకొనును అనుప్రశ్న ఉదయింపగలదు. అది మారకపు రేటు పై ఆధార పడియుండును. ఈమారకపు రేటు ఎట్లునిర్ణయించబడును? విపణియందలి బేరముచేసికొను పద్దతినిబట్టి అని ఆడమ్స్మిత్ ఉద్దేశానుసారముగా రికార్డ్లో అనుచరులిచ్చిన సమాధానము సంతృప్తి కరముగా లేదు. ఆధునిక ననుసరించి వేరొక దేశము యొక్క మునకుగల "అ పేద విస్తరణశక్తి" డిమాండు) పై ఆధారపడి మార్పిడి ఆర్థిక సిద్ధాంతము సరకులపట్ల ఒక దేశ (యెలాస్టిసిటీ ఆఫ్ నిష్పత్తి యుండును.