Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమానముచేయ లేదు. అనేక ములగు వస్తువులను తయారు చేయుటయందు వివిధదేశములకు ఈ విధముగా అసమాన ములుకాని లాభములు వచ్చుట ఈ విధముగా సంభవిం చును. ఈ కారణముచే వివిధ దేశములు కూటములు ఒక దానితో నొకటి పోటీచేయు అవకాశము సన్నగిలుచున్నది. ఇంతేగాక శీతోష్ణస్థితి మొదలగు ప్రకృతి కారణములు అవకాశములందు వ్యత్యాసములుకూడ సంభవించు చుండును. ప్రాంతీయ శ్రమవిభజనము, పరిశ్రమల కేంద్రీ కరణము ఈ విధముగా సంభవించుచున్నవి. ఉదాహరణ మునకు ఖనిజసంపద ఒక దేశమునందు ఎక్కువగా నుండ వచ్చును. బెంగాలువంటి కొన్ని ప్రదేశములు జనుము మాదిరి పంటలను పండించుట కనుకూలమైన శీతోష్ణస్థితి, సారవంతమైన భూమి కలిగియుండవచ్చును. ఇట్టి సౌక ర్యములను ఒక దేశమునుండి మరియొక దేశమునకు మార్చుట అసాధ్యము కావచ్చును. లేదా అట్టిది సాధ్య మైనను మిగుల వ్యయకరము కావచ్చును. అంతర్జాతీయ వాణిజ్యము - తారతమ్యవ్యయ సిద్ధాం తము :- అంతర్జాతీయ వ్యాపారము, అందు పాల్గొను వార లెల్లరకు లాభకారియను విషయము ఇటీవలనే గుర్తింపబడినది. అంతర్జాతీయశ్రమ విభజన మను సిద్ధాం తమును డేవిడ్ హ్యూం, ఆదమ్స్మిత్ అను అధునిక అర్థ శాస్త్రప్రవక్తలు 18 వ శతాబ్దపు అంత్యభాగమున ప్రవ చించిరి. వివిధ దేశములమధ్య సరకుల మార్పిడియు దేశాంతర్గత వ్యాపారమునందువలెనే శ్రమ విభజనము, పరిశ్రమల కేంద్రీకరణము అను సూత్రములపై ఆధార వడి నడుచు ననుటయే ఈ ప్రవచనము యొక్క అర్థము. ప్రతివారును తమకు ఏ వస్తువును ఉత్పత్తి చేయుటయందు ఎక్కువలాభములున్నవో ఆవస్తువులనే ఉత్పత్తిచేసి తమకు ఆ కముగా క్షేమకరములైన ఇతర వస్తువులను మార్పిడిచేసికొనవ లెను. ఏదేని విదేశము మనకన్న తక్కువధరలకు ఒక వస్తువును తయారుచేసి ఈయగలిగిన యెడల ఆదేశమునుండియే ఆ వస్తువును మనకు అధిక ప్రావీణ్యముగల వస్తువులను ఉత్పత్తిచేసి అమ్మగా వచ్చిన ధనముతో తీసికొనవలెను. రాగి, బట్టలు, అను రెండు సరకులలో బ్రిటను, అమెరికాలమధ్య వ్యాపారము జరుగుచున్నదనుకొం 51 అంతర్జాతీయ వాణిజ్యము దము. అంతేగాక ఆ రెండు సరకుల తయారుచేయుట యందు అమెరికాకు బ్రిటనుకున్న అనుకూలమగు పరిస్థి తులు గలవనియు, కాని బట్టలు తయారుచేయుటకన్న రాగి నుత్పత్తి చేయుటయందు ఇంకను ఎక్కువ లాభ ములు గలవనియు ఆనుకొందము. అట్టి పరిస్థితులలో సర కల మార్పిడి జరుగును. ఫలిత మేమన అమెరికా, రాగిని ఉత్పత్తి చేయుటయందు ప్రత్యేకతవహించి, బట్టలు ఉత్ప త్తిని బ్రిటనుకు వదలి వేయును. అమెరికన్ రాగి బ్రిటిష్ బట్టలకు మార్పిడియగును. ఏవస్తువులు తయారుచేయుట యందు అమెరికాకు మిక్కిలి ఎక్కువ ఆధిక్యము గలదో ఆ వస్తువులు తయారు చేయుటయందే తన యుత్పత్తి సాధనములను వినియోగించుటయే ఇందుకుగల కార ణము, ఈ మాదిరి పరిస్థితులలో రెండుదేశముల మధ్య వ్యాపారము జరుగుట తథ్యము. పై ఉదాహరణమునందు రెండు దేశములమధ్య జరుగు అంతర్జాతీయ వ్యాపారములను నిర్దిష్టవ్యయమునకు మారుగా తారతమ్య వ్యయముపై ఆధారపడియున్నది. "ఆర్థికశాస్త్ర సిద్ధాంతములు మరియు పన్ను విధానము " అను గ్రంథమునందు రికార్డ అను రచయిత ప్రవచించిన తారతమ్యవ్యయ సిద్ధాంతములోని అంతరార్థమిదియే. ఒక దేశమందు వివిధవృత్తులనడుమ కాలక్రమేణ లాభ ములు సరిసమానములగుట జరుగును. కాని వివిధ దేశముల మధ్య అట్టిది అసంభవమని రికార్డో తెలిపెను. అంకెలతో కూడిన ఒక ఉదాహరణము నిచ్చుచు అతడు పోర్చుగలు దేశ ముబట్టలను, ద్రాక్షసారాయిని ఇంగ్లండుకంటె తక్కువ ఖరీదుకు ఉత్పత్తి చేయగలిగినను ద్రాక్ష సారాయిని తయారుచేయుటయందు ఎక్కు వలాభసాటి అవ కాశములు కలిగిన యెడల పోర్చుగలు ద్రాక్ష సారాయమునే తయారు బట్టలను ఇంగ్లండునుండి దిగుమతి చేసికొనుట మంచి దని నిరూపించెను. రాగిని ఉత్పత్తి చేయుటకన్న బట్టలను తయారుచేయుటయందే ఇంగ్లండు తనశ్రమను పెట్టుబడిని వినియోగించినచో ఇంగ్లండుకు ఎక్కువ ధనసంపద సమ కూడును. ఇదే కారణమువలన అమెరికా ఇంగ్లండుకు రాగిని ఎగుమతిచేసి బట్టలను ఇంగ్లండునుండి కొనును. దీర్ఘ కాల ప్రయోజనదృష్ట్యా ఈవిధానము రెండుదేశము చేసి లకు లాభకరమగుమ.