Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ వాణిజ్యము

తాత్పర్యము. శ్రమవిభజన మను సిద్ధాంతముపై ఆధార పడి సరకుల ఉత్పత్తి మార్పిడి సాగించు ఆర్థిక వ్యవస్థ నాగరిక ప్రపంచము సంతను ఆవరించియున్నదను విష యము ఒక్కనిముస మాలోచించినచో మనము గ్రహింప గలము. ఇట్టిపద్ధతి ననుసరించి ప్రపంచమునందలి అన్ని ప్రాంతముల జనులు ఒండొరుల అవసరములను తీర్చు కొనుటకై పరస్పరము సహకరించుచున్నారు. ఆర్థిక ముగా మిక్కిలి ఉన్నతిని బడసిన జాతులును తమ లాభ మునకై అంతర్జాతీయ వాణిజ్యముపై నెక్కువగా ఆధార పడుచున్నవి.

శ్రమ విభజనము, పరిశ్రమల కేంద్రీకరణము అను సూత్రముల వెనుకనున్న సత్యములే అంతర్జాతీయ వాణి జ్యాభివృద్ధికిని కారణములు. జాతులు ఉత్పత్తిని, సామర్థ్య మును అభివృద్ధిచేసి ప్రతిజాతి ప్రపంచమునందలి సరకుల వినియోగమును పొందగల లాభమును అధికముచేయునది అంతర్జాతీయ వాణిజ్యమే. తాను నారింజల పండింప జాలడు కావున ఇంగ్లండు, స్పెయినులనుండి ఆ పండ్లను దిగుమతి చేసికొనును. స్పెయినుకు యంత్రములను నిర్మిం చుటకు తగినంత శక్తి లేదు, కావున ఆదేశము బ్రిటనునుండి యంత్రములను దిగుమతి చేసికొనును. ఒక వస్తువును తయారుచేయుటయందు ఏదైన దేశమునకు ఒక నిర్దిష్ట సౌకర్యముండుటయే అంతర్జాతీయ వ్యాపార మారంభ మగుటకు కారణ మగును.

ఒక దేశమునందు కొన్నిసరకులను ఉత్పత్తి చేయుటకు వీలుండవచ్చును. కాని అందులకు దారుణమగు వ్యయము అవసరము కావచ్చును. ఇటీవల జర్మనీ కృత్రిమమైన సిల్కు, పెట్రోలు, విపరీతమగు ఖర్చుతో ఉత్పత్తి చేయ జాలినది. జర్మనీ యిట్టిపనికి పూనుకొనుటకు కారణములు రాజకీయమైనవి కాని ఆర్థికమైనవి కావు. ఇట్టి సంఘట నలు అరుదు. ప్రతిదేశము ఇతరదేశములకంటే, తాను ఏయే సరకులు తక్కువధరకు ఉత్పత్తి చేయగలదో ఆయా సరకుల నే ఉత్పత్తి చేసి, తానే ఉత్పత్తి చేయుటవలన ఎక్కువ వ్యయమగు వస్తువులను వానితో మార్పిడి చేసికొనును. విదేశములలో అగు ఖర్చుకన్న తక్కువ ఖర్చుకే తాను సరకులను ఉత్ప త్తిచేయగలిగిన పరిస్థితులలో కూడ ఆ సరకు లను విదేశములనుండి దిగుమతి చేసికొనుటయే ఒక్కొ క్కప్పుడు ఒక దేశమునకు లాభకరము కావచ్చును. అంత కన్నను ఎక్కువ లాభసాటియగు వస్తువులను తయారు చేయుటయందే దిగుమతిచేసికొను దేశము ప్రత్యేక నైపుణ్యము కలిగియుండుటయే దీనికి కారణము. దీనినే తారతమ్యవ్యయ సిద్ధాంతము (థియరీ ఆఫ్ కం పేరిటివ్ కాస్ట్స్) అని యందురు.

అంతర్జాతీయ వాణిజ్యముయొక్క లక్ష్యము ఒక వస్తువును ఇంకొక వస్తువుతో మార్చిడి చేసికొనుట ద్వార వీలయినంత ఎక్కువ లాభము పొండవ లెననుట యే. అంతర్జాతీయ వాణిజ్య సిద్ధాంతమునకు దేశాంతర్గత వాణిజ్యసిద్ధాంతమునకు మధ్య భేదముకలదు. దేశాంతర్గత వ్యాపారమునందు ఉత్పత్తిసాధనములు తమకు అధిక ప్రతిఫలము లభించు ప్రాంతములకు వృత్తులకు మారు చుండును. ఉత్ప త్తిసాధనముల మార్పు వివిధ దేశముల మధ్య అంత స్వేచ్ఛగా జరుగదు. ఒక దేశమునుండి కార్మికులు మరియొక దేశము వలసపోవుటకు విశేషమైన ఖర్చులు, భాష, భావ భేదములు అడ్డంకు లగుచున్నవి. పెట్టుబడిని ఇచ్చిపుచ్చుకొనుట అంతకష్టమైనది కాకపోయి నను, పెట్టుబడిదారుల అజ్ఞానము విదేశములలో పెట్టుబడి పెట్టుటలోగల అపాయములు ఇందుకును కొంతవరకు అడ్డం లగుచున్నవి.

వివిధ రాజకీయప్రాంతముల నడుమ కార్మికులు పెట్టుబడి, సులభముగా రాకపోకలు సాగించలేక పోవుటకు భాష, చట్టములు, ద్రవ్యమానము, మత, సాంఘిక విష యములందుగల తారతమ్యములు, భయము, అజ్ఞానము. వేదతనము, భావభేదములు కారణము లగుచున్నవి. పెట్టుబడి విషయములందుకంటే కార్మిక విషయములలో నే. ఈ అడ్డంకులు ఎక్కువగా వర్తించును. పెట్టుబడిదారులు కూడ కార్మికులవలెనే సాధ్యమైనంతవరకు స్వదేశమందే తమధనమును పెట్టుబడి పెట్టుటకు ఇష్టపడుదురు. అంతర్జాతీయ దేశాంతర్గత వ్యాపారముల మధ్యగల మరియొక ముఖ్యభేదము రెండుదేశములలోను వేరువేరు ప్రభుత్వములుండుట వలన సరకుల రాకపోకలు సులభముగా జరుగుటకు రాజకీయపు ఆటంకము లేర్పడుట.

పోటీవిధానము ఈ కారణములవలన ఒ కేదేశ మునందు వలె ఒకేవిధమైన వస్తువుల ఉత్పత్తి కగు ఖర్చులు సరి