Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మైన రూపములో న్యాయశాస్త్ర స్మృతిగా అంత ర్జాతీయ న్యాయము రచింపబడుటకు సాధ్యపడలేదు. అంతర్జాతీయ న్యాయశాస్త్రము వెనుకనున్న అను మతి (sanction) కచ్చితముగా ఏది ? అను ముఖ్య ప్రశ్నము నిర్ణయింపదగియున్నది. ఇట్టిస్థితిలో ఏ న్యాయ శాస్త్రమునుగూర్చియు చేయబడు తుది విమర్శనమైనను బాహ్యముగాను, ఆంతరముగాను అది విధించెడి విధులకు బద్ధులగు ప్రజలు దానివిషయమున చూపునట్టి విధేయతా ప్రమాణము పై నాధారపడియుండును. అంతర్జాతీయ సమాజములో ఒక రాష్ట్రములోవలె, నిర్బంధకశక్తి లేదు; అందుచే, న్యాయశాస్త్రములో ఆజ్ఞా సిద్ధాంతమును ప్రబలముగా సమర్ధించువాడగు సర్ జాన్ ఆస్టిన్ వంటి ప్రసిద్ధ న్యాయశాస్త్రజ్ఞుడు అంత ర్జాతీయ న్యాయము, యథార్థము చెప్పవలసినచో అది ఒక న్యాయశాస్త్రమే కాదని చెప్పియున్నాడు. ఆస్టిన్ యొక్క దృష్టిలో, ఒక న్యాయశాస్త్రము నిజముగా న్యాయశాస్త్రము కావలయునన్నచో దాని వెనుక ఆధార భూతముగానున్న శక్తి లేక నిర్బంధమునుబట్టి దానిని నిర్ణయింపవలసి యుండును. ఒక సంఘమునందలి మానవ బృందముచేత కొన్ని సూత్రములు లేక నియమములు అలవాటు చొప్పున అనుసరింపబడుచు వచ్చి, అవి స్పష్ట తను, నియతత్వమును, సామాన్యతను పొందినచో, అట్టి సూత్రములు లేక నియమములు ఒక సర్వాధికారములు గల ప్రభువు యొక్క ఆజ్ఞ తోగూడిన న్యాయశాస్త్రమునకు ఎట్టి శక్తి గాని, ఎట్టి న్యాయాధికారముగాని గలదో అట్టి శక్తినే, అట్టి అధికారబలమునే పొందును. ఆచారము. పూర్వోదాహరణము, అభ్యాసక్రమము, అవగతి మున్నగు నవి ఆధారముగా ఇంగ్లండునందలి న్యాయశాస్త్రము ఏర్పడియున్నది. అంతర్జాతీయ నియమములు ఇంగ్లండు నందలి అట్టి సామాన్య న్యాయశాస్త్రము యొక్క దృష్టి చేత నే పరిశీలించబడవలయునన్న అంశము అందరు ఎరిగి నదే. అందుచేత రాష్ట్రములును అందలి ప్రజలును తప్పక అనుసరింపవలసిన ఇతర ఆచారగతములగు న్యాయముల వంటిదే అంతర్జాతీయ న్యాయమగుచున్నది. ఎందుచేత ననగ, దాని సూత్రములు అభ్యాసవశమున ఆచరింపబడి, అనుసరింపబడి, అమలులో పెట్టబడుచున్నవి. న్యాయ 7 49 అంతర్జాతీయ వాణిజ్యము మూర్తియైన గ్రే అను నతడు ఒకమారు ఇట్లు చెప్పి యున్నాడు: "అది (అంతర్జాతీయ న్యాయశాస్త్రము) మన న్యాయములో ఒక భాగమై యున్నది. దానిమీద ఆధారపడియున్న హక్కులతో సంబంధముగల ప్రశ్నలు నిర్ణయముకొరకు క్రమముగా దాఖలు చేయబడినపుడెల్ల తగిన న్యాయాధికారము గల న్యాయవిచారణ సభలచే అవి విచారింపబడి, శాసింపబడుచుండవలెను. ఏన్యాయముగాని ఉల్లంఘింపబడినంత మాత్రముచేత. అది అసలే లేకుండనున్నదానితో సమానము కాజాలదు. తరచుగా చేయబడిన న్యాయభంగములు, ఉల్లంఘనములు లేక గొప్ప నిరాకరణములు, చేయబడినంతమాత్రమున అంతర్జాతీయ న్యాయము అంతర్జాతీయ సమాజములో రూపుమాసిపోయినదని ఊహింపరాదు. సవరింప సాధ్యము గాని దగు జాతీయ అధిరాజ్యము అను సిద్ధాంతము ఒక్కటిమాత్రమే అంతర్జాతీయ సంబంధములలో ముఖ్య లోపముగానుండి, అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను బలహీనము కావించుచున్నది. కాని శాంతి కాలములో వలెనే యుద్ధ కాలములో గూడ, అంతర్జాతీయ న్యాయశాస్త్ర నియమములు సాధారణ ముగా అనుసరింపబడి దృఢముగా ఆచరింపబడుచున్నవి, అను విషయమును న్యాయశాస్త్రజ్ఞుడుగాని సాధారణ మనుష్యుడుగాని సరిగా తరచు గ్రహింపజాలకున్నాడు. “ఒకే ప్రపంచము" అనెడు భావన క్రమక్రమముగా అని వార్యమైన సత్యముగా రూపొందుచున్నది. అందుచేత, "సర్వగతమగు అంతర్జాతీయ న్యాయము,” కాలక్రమ మున, భావి ప్రపంచ రాష్ట్రము యొక్క సార్వజనిక మైన న్యాయముగా పరిణమింపగలదని నిశ్చయించుట కేవ లము ఊహాజనితము కాజాలదు. ఆర్. వా. పి. అంతర్జాతీయ వాణిజ్యము : - వివిధములు, ఉన్న తములు, అనేకములు అగు మానవావసరము లన్నియు శ్రమ విభజనమని మనము వర్ణించు సిద్ధాంతము ననుసరిం చియే తీర్చబడుచున్నవి. ఒక ఆర్థిక వ్యవస్థయందలి సభ్యులు' ఒక ప్రత్యేక వస్తువును ఉత్పత్తి చేయుటయందే శ్రద్ధ వహించి తమసుస్థితికి అవసరమైనతనవస్తువుల నితరులతో మార్పిడి చేసికొందురనుటయే ఈ సిద్ధాంతము యొక్క