Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము) శాశ్వతముగా అంతర్జాతీయ న్యాయసభ స్థాపింపబడెను. ఆ స్థాపనచే అంతర్జాతీయ న్యాయశాస్త్ర చరిత్రములో "న్యాయ విచారణ శాసన నిర్మాణము" నకు చెందిన ఒక నూతన యుగము ప్రారంభమయ్యెను. ఈ "శాశ్వత న్యాయసభ” చే గావింపబడిన న్యాయనిర్ణయముమూల మన శాశ్వతమయిన లాభము కలిగెను. ఎందుచేతననగా అంతర్జాతీయ న్యాయశాస్త్రమునందలి సందగ్ధములును వివాదగ్రస్తములును ఐన యంశములు న్యాయసభ చే పరిష్కరింపబడును. అట్లు పరిష్కరించుటలో న్యాయసభ ఇంకను నవీనములైన న్యాయ శాస్త్రవిధులను ప్రవచించి ప్రతిపాదించెను. శాశ్వత న్యాయపథ యొక్క స్థానములో నేడు "అంతర్జాతీయ న్యాయశాస్త్ర విచారణ సభ" పని చేయుచున్నది. ఇదికూడ అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను వ్యాఖ్యానించుట యందును, అన్వయించుటయందును నిమగ్నమైయున్నది.

మొదట ప్రపంచయుద్ధమునందు పాల్గొనిన జాతుల వారు తాము నూతనముగా కనిపెట్టియున్న అపాయకర ములగు యుద్ధాయుధములను అందు ఉపయోగించిరి. ఇట్టి యుద్ధానంతరము అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క సామాన్య సూత్రములందు పెక్కు మార్పులు ఘటిల్లెను. - 1899, 1907 సంవత్సరములలో జరిగిన హేగ్ పరిషత్తులు నిర్ణయించిన భూయుద్ధ సముద్రయుద్ధ నియమముల నన్నింటిని యుద్ధానుభవము ననుసరించి సవరించి, యుద్ధము ముగిసినతోడనే ఉదయింప దొడగిన అంతర్జాతీయ సంబంధముల విషయమున మార్పు నొందు చున్న ఆశయములకు అనుగుణముగా క్రొత్తనియమము లేర్పరుపవలసిన అవసరము కలిగెను. యుద్ధములో విమానముల యొక్కయు, జలాంతర్గాముల యొక్కయు ఉపయోగము అంత ర్జాతీయ న్యాయశాస్త్రము నందు విచ్ఛేదమును కల్పించెను. ఇంతకుమునుపు ఊహించుటకు కూడ సాధ్యపడని పరిస్థితుల నెదుర్కొనుటకై క్రొత్త నియమములను ఏర్పరుపవలసి వచ్చెను. ఆధునికములైన యుద్ధావసరములను ఎదుర్కొనుటకయి 1919 లో విమాన యాత్రాపరిషత్తును, 1925 లో బాష్ప ప్రయో గముతోను, క్రిమీప్రయోగముతోను కూడిన యుద్ధమునకు 48 సంబంధించిన జెనీవా ఒడంబడికను, 1929 లో జెనీవా సమావేశమును, 1936 లో లండన్ జలాంతర్గామి సంబంధించిన ఒడంబడికను ఏర్పరచ నియమము లకు వలసివచ్చెను. అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను విశేషసంఖ్యగల రాష్ట్రములు బద్ధము లగుటకు అంగీకరించిన నియమములను దోషరహితము లయిన పదములచే నిర్వచించుటకును నానాజాతి సమితి కూడ ప్రయత్నించెను. అట్లే, రెండవ ప్రపంచయుద్ధము ముగియుటతోడనే, క్రొత్త నియమములను ఏర్పరచి, ప్రాత నియమములను సమంజసముగా కాలానుకూల ముగా మార్చవలసివచ్చెను. అంతర్జాతీయ న్యాయశాస్త్ర మును కాలానుగుణముగా సవరించి ప్రగతియుక్తముగా స్మృతి బద్ధము చేయు (codify) నవకాశములను అన్వే షించుటకై ఐక్యరాజ్యసమితి ఒక నిపుణుల సంఘమును నియమించెను. సభ్యత్వము (membership) గల రాష్ట్రముల అంగీ కారముతో అంతర్జాతీయ శాస్త్రము యొక్క నియమము లను స్పష్టమును, శక్తియుతమునైన పదములతో నిర్వ చించునట్టి దుర్వహమైన కార్యమునందు 1948 లో ఐక్యరాజ్య సమితియొక్క సాధారణ సమితిచే నియుక్త మయిన అంత ర్జాతీయన్యాయశాస్త్ర సంఘము నిమగ్నమై యున్నది. అణుసంబంధములగు అస్త్రములను, బహిష్క రించు విషయము నేటి వివాదగ్రస్తములును చర్చనీయ ములునైన అంశములలో నొకటి. ఇది సర్వ ప్రపంచము లోని, రాజ్యతంత్రజ్ఞుల యొక్కయు, న్యాయశాస్త్రజ్ఞుల యొక్కయు దృష్టిని సమానముగా నాకర్షించుచున్నది. ఇట్లు న్యాయశాస్త్రజ్ఞులు అంతర్జాతీయ న్యాయసును స్మృతిబద్ధము (codify) చేయుటకు యత్నించుచున్నారు. కాని ఇది యింకను వృద్ధిపొందుచు, ఎడతెగక పరిణా మము పొందుచున్న న్యాయముగానున్నది. అంతర్జాతీయ సంబంధముల వైఖరిమీదను, జాతుల యొక్క ఔదా ర్యము మీదను అంతర్జాతీయసంస్థల నిర్మాణము మీదను ఇది చాలవరకు ఆధారపడియున్నది. అందుచేత, శి విషయకములును, విధి విషయకములును లేక వ్యక్తి విషయకములును అగు న్యాయశాస్త్ర స్మృతులు మున్నగు నగరపరిపాలనా న్యాయస్మృతులవలె సమగ్ర