Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నియమములును నెమ్మదిగా అంకురింపదొడ గెను. ఈ కాల ముననే కొందరు తొలి రచయితలు న్యాయశాస్త్ర విష యమున ఎన్నదగిన కృషిని సలిపియుండిరి. వీరిలో నీ క్రిందివారు ముఖ్యులు :- ఆయలా విటోరియా (1482-1546) - ఇతడు సాల మన్కా విశ్వవిద్యాలయము నందలి ఆచార్యుడు; (1548-1584) - ఇతడొక స్పెయిన్ న్యాయశాస్త్ర జ్ఞుడు; సూరస్ (1548-1617), గెంటిలిస్ (1552- 1808) ఇటలీ దేశీ ముడుగు నితడు తర్వాత ఆక్సుఫర్డులో “సిపిల్” న్యాయాచార్యు డయ్యెను. కాని ప్రాథమిక రచయితలలో మిక్కిలి గొప్పవాడు హ్యూగో వాన్ గ్రూటు అనునాతడు. ఇతడు అంతర్జాతీయ న్యాయ రచయిత గ్రోషియస్ (1588-1845) అను పేరుతో ఇతడు ప్రసిద్ధికెక్కెను. ఇతడు "జాతీయ న్యాయపిత "అని ప్రశంసింపబడి, ఆరాధింపబడుచున్నాడు. "డిజూర్ బెల్లి ఏక్ పేసిస్ (Dejure belli acpacis) ( అనగా యుద్ధము యొక్కయు, శాంతి యొక్కయు న్యాయము) అను నితని సమగ్రమైన గ్రంథము 1625 లో మొదట ప్రచు రింపబడినది. ఇది అంతర్జాతీయ న్యాయశాస్త్రమును గూర్చి వ్రాయబడిన మొదటి గ్రంథము. ఇది అన్ని న్యాయశాస్త్ర గ్రంథములలో నెల్ల విశిష్టమైనది గాను, ప్రామాణికమైనదిగాను అంగీకరింపబడినది. అయినను ఇత నిని అంతర్జాతీయ న్యాయశాస్త్రమునకు "స్థాపకుడుగా” పేర్కొనుట అత్యుక్తి కాగలదు. ఇత డొనర్చిన కార్యమిది: చరిత్రలో తొలిసారిగా ఇతడు విషయజ్ఞానమునకు పనికి వచ్చు కొన్ని అంశములను, కొంత సామగ్రిని ప్రోగు చేసి, రాష్ట్ర నిర్వహణమునకు సంబంధించిన కొన్ని ప్రాతిపదిక సిద్ధాంతములను చేసి వాటిని బట్టి రాష్ట్రములు అనుసరింప వలసిన అన్యోన్య ప్రవర్తనమునకు చెందిన నియమములను తర్కించి, రాష్ట్రముల మధ్య ప్రవర్తిల్లుచున్న వ్యవహార ములు, ఆచారములు, అలవాట్లు మున్నగువాని యొక్క శిక్షణమును క్రమబద్ధ మొనర్చెను. గ్రోషియసుకు తరువాత వచ్చిన రెండు శతాబ్దుల యందును, అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క పరిశీలనమునకు ఆక్సుఫర్డులో ఆచార్యుడగు జౌక్ (Zouche) (1592-1680), జర్మన్ ఆచార్యుడగు 47 అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము) పూఫెన్ర్పు (Pufendorf) (1682-1694); బైన్ కర్ పాక్ (Bynkershock) (1678-1749); ఊల్ఫు అను డచ్చి న్యాయశాస్త్రజ్ఞుడు (1879-1754); వేటల్ (Vattel) (1714-1767) మున్నగువారు ఎంతో దోహ ధము కలిగించిరి. 1815 లో జరిగిన వియన్నా కాంగ్రెసు సమయ మందే అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియ మములు నెమ్మదిగా సుస్పష్టమైన వాక్యములలో ప్రతిపా దింపబడుటకు మొదలయ్యెను. ఇంతకు పూర్వము అంత ర్జాతీయ న్యాయశాస్త్ర నియమములు వివిధ న్యాయ వివిధన్యాయ శాస్త్రజ్ఞుల పరస్పర విరుద్ధాభిప్రాయము లనేడు విషమ వ్యూహమున చిక్కువడియుండెను. 19 వ శతాబ్ది ఉదయించినతోడనే ప్రకృతము అస్పష్టముగ వ్యవహరింప బడుచున్న అంతర్జాతీయ శాసన నిర్మాణ విధానము పెంపొంద నారంభించెను. ఈ శతాబ్దియందే అంత ర్జాతీయ సంబంధముల యొక్క ఆచార వ్యవహారములు నిశ్చయ ప్రమాణమును అందుకొని స్పష్టరూపస్థితిని వహించెను. అనేకములయిన అంత ర్జాతీయ పరిషత్తుల చేత సుస్పష్టముగ నియమములు నిర్వచింప బడెను. 1899, 1907 సంవత్సరములలో హేగ్ నందు పరిషత్తులు ఏర్పాటు చేయుటతోడను; వివాద పరిష్కారమునకై శాశ్వతమైన న్యాయసభ స్థాపింపబడుటతోడను: నానాజాతి సమితి (League of Nations)ఉద్భవించుటతోడను; అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క ఉద్దేశపరిధి విశాలమయ్యెను. ఇంతే కాక "పారిస్ ప్రకటనము" (1856) "జెనీవా సమావేశము" (1884), "లండన్ నావిక ప్రకటన” (1910) వంటి అనేక ప్రకటనములు "ఒడంబడిక ల ప్రాథమిక పత్రములు (Protocols) మొదలగు వాని వలన, అంతవరకును కేవలము అనిశ్చతములుగాను, కేవలము అంతర్జాతీయ న్యాయశాస్త్రజ్ఞుల అభిప్రాయ ములుగాను, వివిధ రాష్ట్రముల విశ్వాసము మీదనే విశేషముగా ఆధారపడునవి గాను ఉన్న అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములకు స్పష్టత, నిశ్చయత సిద్ధించెను. మొదటి ప్రపంచ యుద్ధమునకు సంబంధించిన ద్వేష ములు ఉపశమించినపిదప, హేగుపట్టణము (పోలెండు)లో