అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము)
మము పూర్తిగా రద్దుచేసినది. ప్రత్యేక వ్యక్తులు కూడ అంతర్జాతీయ న్యాయము ననుసరించి నిర్వర్తింపవలసిన కొన్ని హక్కులును, ఆవశ్యక కార్యములును కలవను విశ్వాసమును యుద్ధాపరాధములను గూర్చిన భావన కలిగించినది. ఐక్యరాజ్య సమితిచే ఆమోదింపబడిన రీతిగా మానవుని హక్కుల యొక్క ప్రతిపాదనము ఈ విశ్వాసమును ఇంకను ఎక్కువగా బలపరచినది. అందుచే ఈ ఆధునిక పరిణామములనుబట్టి అంతర్జాతీయ న్యాయశాస్త్రము తిరిగి యిట్లు నిర్వచింప బడవలసియున్నది. ఎట్లనగా:- చాలవరకు రాష్ట్రజనులు మనస్సాక్షిగా తమకు అవగ్యాచర ణీయము లని భావించునట్టియు, పరస్పర అలవాటు ప్రకారము ఒక రాష్ట్రమువారు అన్య రాష్ట్రీయుల పట్ల అనుసరించునట్టియు న్యాయసూత్రముల యొక్క సముదాయమే అంతర్జాతీయ న్యాయము. అయినను దానియందు అంతర్జాతీయ సంస్థల యొక్కయు లేక వ్యవస్థల యొక్కయు ప్రవృత్తులకును, వాటి అన్యోన్య సంబంధములకును చెందిన నియమములుగూడ ఇందులో చేరియున్నవి. మరియు ప్రత్యేకవ్యక్తులకును, ఇతరరాష్ట్రీయులకును సంబంధించి, వారికి కొన్ని హక్కులను, ధర్మములను విధించెడి న్యాయశాస్త్ర నియమములు గూడ ఇందులో చేరియున్నవి.
ఆంతర్జాతీయ న్యాయశాస్త్రముయొక్క ఉద్దేశము:- శాంతి కాలములోగాని, యుద్ధ కాలములోగాని, అంతర్జాతీయ సమాజములోని న్యాయపరిపాలన (Rule of Law) సూత్రమును వర్తింపజేయుట "సార్వజనికమగు అంతర్జాతీయ న్యాయము” యొక్క ప్రధానోద్దేశమై యున్నది. సార్వజనికమగు అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములు తరచుగా శాంతి సమయమందే గాక, యుద్ధమువంటి అసాధారణ పరిస్థితులయందును తటస్థ స్థితియందునుగూడ అలవాటును బట్టి అనుసరింపబడుచున్నవి.
అంతర్జాతీయ న్యాయశాస్త్రముయొక్క ఉత్పత్తి వికాసములు :- అంతర్జాతీయ న్యాయము యొక్క నియమములు మానవ నాగరికత యొక్క ఉదయకాలము నుండి ఉద్భవించియున్నవి. రాజదూత, లేక రాయబారులను రక్షించు నియమములు, యుద్ధధర్మములు, ప్రాదేశిక ఆధిపత్య నియమములు మున్నగు సూత్రములు ప్రాచీన గ్రీసునందలి రోమన్ విజయమునకు పూర్వయుగముల నుండియును, ప్రాచీన భారతమునందలి పురాణయుగము నుండియును అనుసరింపబడుచున్నట్లు తెలియుచున్నది. అతి ప్రాచీన కాలపునాటి అంతర్జాతీయ న్యాయశాస్త్రముకంటె భిన్న మైన ఆధునిక కాలపు అంత ర్జాతీయ న్యాయశాస్త్రము గడచిన నాలుగు, ఐదు శతాబ్దముల నుండి మాత్రమే క్రమపరిణామమును పొందినది. దీనికి నేటి యూరపు దేశము నందలి క్రైస్తవ నాగరికతతో గాఢమైన అనుబంధము కలదు అందుచేత అంతర్జాతీయ న్యాయశాస్త్ర నియమములలో పెక్కులు పాశ్చాత్య దేశముల యొక్క జాతీయ సర్వాధిపత్యము, ప్రాదేశిక పూర్ణత, రాష్ట్ర స్వాతంత్య్రము మున్నగు భావముల ప్రభావమునకు లోనై యుండుటలో ఆశ్చర్యములేదు.
రోమన్ సామ్రాజ్యము విచ్ఛిన్నమై, యూరపులో స్వతంత్ర రాష్ట్రములు బయలు దేరిన కాలమునుండియు నేటి అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క చరిత్ర ప్రారంభమగు చున్నది. అంతర్జాతీయ న్యాయశాస్త్రమునకు రోమనులు గావించిన పుష్టి మిక్కిలి స్వల్పమైనది. ఏమనగా రోము సామ్రాజ్యరాష్ట్రము గనుక, దానితో సమాన ప్రతిపత్తిగల ఎట్టిసంబంధము వృద్ధిపొందుటకు అవకాశములేదు. ఐనను, చాల కాలము తర్వాత, అంతర్జాతీయ వ్యవహారముల యొక్కయు, కార్యకలాపముల యొక్కయు విషమ సమస్యలతో గూడిన పరిస్థితులకు మాయోపాయముచే దాటుటకు అంతర్జాతీయ న్యాయశాస్త్రజ్ఞులు రోమను న్యాయము యొక్క సూత్రముల సహాయము నర్థించి వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుచుండెడివారు.
మధ్య యూరపులోను, అంతకంటే ఎక్కువగా ఇటలీలోను, చిన్నచిన్న స్వతంత్ర రాజ్యములు పెంపుగాంచుటతో, ఒక దానితో నొకటి రాజ్యతంత్ర సంబంధము లేర్పరచుకొనుటకు రాష్ట్రములకు అవసరము కలిగెను.అందుచే రాయబారులను పరస్పరము మార్చుకొనుట వారిని నియోగించుట, వారిని స్వీకరించుట, వారికి తగు మర్యాద నొసగుట, వారికి రక్షణమొసగుట మున్నగు నియమములును, న్యాయశాస్త్రోక్తమయిన యుద్ధమునకును తాటస్థ్యమునకును సంబంధించిన మరికొన్ని