Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

L ఉదా :- ఒక ఆంగ్లేయుడు, ఒక ఫ్రాన్సు దేశీయుడును ఇటల దేశ ములో అమలుపరుపదగిన ఒక ఒడంబడికను జర్మనీలో చేసికొన్నారు. వారిలో నొకరు ఆ ఒడంబడికకు భంగముగా ప్రవర్తించుటచే, ఒక ఇంగ్లండు దేశపు కోర్టును ఆ వివాద విషయమును పరిష్కరించవలసినదిగా కోరినచో అట్టి పరిస్థితిలో మొదట నిర్ణయింపవలసిన సమస్య ఆ అభియోగమును స్వీకరించుటకు ఇంగ్లీషు కోర్టుకు అధికారమున్నదా, లేదా అనునది. (2) ఈ మొదటి విషయమున ఇంగ్లండు దేశపు కోర్టున కధికార మున్నట్లుగా నిర్ణయమైన యెడల, న్యాయ విధానము అవ్విషయమున ఉపయోగింపవలసి యుండు నను ప్రశ్న బయలు దేరును. అటుతరువాత ఏ పై పరిస్థితిలో ఉపయోగింపవలసిన న్యాయమేది? ఒడంబడిక జరిగిన ప్రదేశపు న్యాయమా, అనగా జర్మనీ దేశపు న్యాయమా? లేక, ఒడంబడిక అమలు జరుగవలసి యున్న ప్రదేశపు న్యాయమా, అనగా ఇటలీ దేశపు న్యాయమా ? అట్లుగాక, అభియోగము తీసికొనిరాబడిన ప్రదేశపు న్యాయమా, అనగా ఇంగ్లండు న్యాయమా? అనునవి కొన్ని ప్రశ్నలు. దేశపు పై ప్రాథమిక సమస్యలను నిర్ణయించుటకు వేర్వేరు దేశములు అనుసరింపవలసిన నిబంధనావళికి ప్రైవేటు (Private) అంతర్జాతీయ న్యాయము లేక "న్యాయ వైరుధ్యము” అని పేరు. ప్రపంచములో ఒక దానితో నొకటి పరస్పరముగా భిన్నముగానున్న న్యాయశాస్త్ర విధానములుండుటచేత, న్యాయశాస్త్ర విధానములో ఈ నియమము లుండుట ఆవశ్యక మైనది. ప. వేం. అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము) Public International Law] :- అంతర్జాతీయ న్యాయ శాస్త్ర మనగా నేమి ? పరిణామము యొక్కయు చారిత్రి కావసరముల యొక్కయు మంద ప్రవృత్తిచేత సార్వజనిక మయిన(Public)అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములు అంతర్జాతీయ సమాజములో పెంపుగాంచి యున్నవి. సార్వజనిక మగు (Public) అంతర్జాతీయ న్యాయశాస్త్రము వైయక్తికమగు అంతర్జాతీయ న్యాయ 45 అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము) శాస్త్రముకంటె భిన్నమయినది. ఇందు సాధారణముగా రాజ్య సముదాయములు పరస్పరముగా ప్రదర్శింపద గిన నడవడిని నిర్ణయించెడి నియమము లుండును. వైయక్తిక నగు (Private) అంతర్జాతీయ న్యాయశాస్త్రము విశద ముగా వ్యక్తులతో సంబంధము కలిగియున్నది. సార్వజనిక మగు అంతర్జాతీయ న్యాయశాస్త్ర సూత్రములు అట్లుగాక, ఒకటి అంతకంటే ఎక్కువసంఖ్యగాగల రాజ్యముల మధ్య గల సంబంధమును వివరించుచు సాధారణముగా రాజ్య మును పరస్పరము అవశ్యకర్తవ్యముగా గుర్తింపదగిన నడవడిని నిర్ణయించును. కాని ఆధునిక కాలపుపరిణామము లనుబట్టి చూచినచో, అంతర్జాతీయ న్యాయము రాజ్యము లకుమాత్ర మే సంబంధించినదని శాసించి చెప్పుటతప్పు. వివిధ రాజ్యముల మధ్య క్రమమును న్యాయబద్ధమునై న జీవన మును, సహజమైన మైత్రిని స్థాపించుటలో ఈ సూత్రము లును నియమములును విశేషముగా కారకములయ్యెనను టలో సందేహములేదు. గడచిన రెండు ప్రపంచ యుద్ధ ములు, తరువాతి సంఘటనలును కలిగించిన ఫలితముగా, జటిలములును,సుసంఘటితమును అయిన అ అ నేక సంస్థలును, అంతర్జాతీయ న్యాయశాస్త్ర సమ్మత వ్య క్తిత్వముగల అంతర్జాతీయ జనసంఘములును బయలుదేరినవి. వాటికి అంతర్జాతీయ న్యాయసూత్రములు వర్తింప జేయబడినవి. అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రత్యక్ష నిర్వహణమునకు సంబంధించిన నియమములకును, ఆ సంస్థలలో ఒక దానితో మరి యొకదానికి గల భిన్న సంబంధములు, భిన్న రాష్ట్రము లతో వాటికి గల సంబంధములకును సార్వజనికమయిన (Public)అంత ర్జాతీయశాస్త్రన్యాయములో స్థాన మొసంగ బడినదని గమనించుట ముఖ్యవిషయము. అంతేకాక, రెండవ ప్రపంచయుద్ధము ముగిసిన తర్వాత అంతర్జాతీయ న్యాయశాస్త్రములో కొన్ని క్రొ త్తసూత్రములు బయలు వెడలినవి. అవి ముఖ్యముగా కొన్ని తరగతుల వ్యక్తులకు మాత్రమే సంబంధించినవి. న్యూరెంబర్లు, టోకియోలలో అంతర్జాతీయ సైనిక న్యాయసభలచే విచారింపబడిన యుద్ధాపరాధుల విషయము దీనికి ఉదాహరణము. అంత ర్జాతీయ న్యాయము భిన్న రాష్ట్రముల మధ్యనుండు నియమములకు మాత్రమే ముఖ్యముగా వర్తించును అను న్యాయశాస్త్రజ్ఞుల పూర్వాభిప్రాయమును ఈ పరిణా