Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయన్యాయము (వైయక్తికము) బాడ్ ఉన్నవి. అక్కడ ఉన్న వాటన్నింటిలోను పెద్ద దగు ఒక గుహ 4000 అ॥ పొడవు, 625 అ॥ వెడల్పు, 350 అ॥ ఎత్తుకలిగి ఉన్నది. ఇట్లు ఏర్పడిన గుహలు అగా ధములైన (Chasms) సొరంగ మార్గములతో అన్నియు కూడ ఒక దాసె నుండి మరియొక దానికి మార్గము కలిగి ఉండును. వీటినుండి, అంతర్జాలము నదులవలె ప్రవహిం చును. ఇట్లు పెక్కు సెలయేరులై ప్రవహించెడు నీరు, కొంత దిగువున, ఒక పెద్ద నదీ ప్రవాహమువలె బయల్వెడ లును, సున్నపురాతిగుండ ప్రవహించెడి నీరు కొంత కర్బని ద్విఆమ్లజని (Corbondioxide) కలిగియున్నందున, దానిని కరగించును. ఈ ద్రవము కొంత కర్బని ద్విఆమ్లజని ఆవిరిరూపమున కోల్పోయిన, కరిగియున్న కొంత కార్బ నేటు (Carbonate) కాల్సైటుగా నిక్షేపించబడును. భూమిలోని గుహలలో పై భాగమునుండి వ్రేళ్ళాడు నట్లుండు కాల్సైటును “స్టాతి క్లైట్సు”అనియు, క్రిందిభాగ మున స్తంభములవలె నిలువబడియుండు కాల్సైటును "స్టాలగ్ మైట్లు" అనియు అందురు. అంతర్జలములలో నుండెడు పదార్థము ఖటిక కర్బనితము (Calcium carbonate) ఒక్కటేకాదు. ఇసుక పదార్థము కూడ తరుచుగా నుండును. ఉదాహరణకు, చెకుముకిరాయి (Flint concussion) సులభముగ కరుగని రాళ్ళచుట్టును ఏర్పడుట, చెప్పవచ్చును. డెండ్రైట్సు అనునవి యినుము, మాంగనీసు యొక్క ఆమ్లజనిదముల ఉత్పాదనీయమైన అవిశేవరూపములు (Secretionary forms). ఇంక ఎడారులలో ఒయాసిస్ లనబడెడు ఫలవంతమైన ప్రదేశములు చాల ఎన్నతగినవి. ఇవి అంతర్జాలము ఉపరి భాగమును చేరుటవలన ఏర్పడును. ఇట్లు అంతర్జాలము పైకి ఉబుకుటవలన, ఆ ప్రదేశములు సారవంతముగా మారుచుండును. అచ్చట చెట్టు చేమ లుండుటవలన, అంత వరకు ఇసుకపర్రగా ఉండేడు ప్రదేశముల మధ్య అవి స్వర్గతుల్యముగా కన్పడును. అంతర్జాలపు ఉనికి, కొన్నిచోట్ల భూతత్వశాస్త్రరీత్యా కనిపెట్టవచ్చును. ఇటీవల భౌతిక శాస్త్ర పద్ధతుల ద్వార (Geographical Methods) క నుగొనుట కూడ జరుగు చున్నది. విద్యుత్పరిశోధనల ద్వారా (Electrical pros- pecting methods) అంతర్జాలపు ఉనికి కని పెట్టుటకు, శిలల 44 e నిరోధకతలోని వ్యత్యాసము (Variation of resistance in rocks) కొంతవరకు తోడ్పడుచున్నది. డా. యస్. డా. అంతర్జాతీయ న్యాయము (వైయక్తికము) న్యాయ (విధి) వైరుధ్యము :- ఒక విదేశాంశ ప్రసక్తి కలిగిన అభియోగములను నిర్ణయించుటకు ఉపకరించు నిబంధనలతో గూడిన న్యాయ సూత్ర సముదాయమునకు న్యాయ వైరుధ్యము (Conflict ofLaws) అను పేరు ఒసగబడుచున్నది. స్వీయవిచారణాధి కారమునకు లోబడిన ప్రదేశములో ఈ దిగువ సందర్భములలో బయలు దేరు వివాదములను గుర్తించి విచారణ లోనికి తీసికొనుటకై ఒక దేశములోని న్యాయ విచారణ సభలు స్థాపింపబడియున్నవి, ఆనాడు సభల విచార ణాధికారమునకు లోబడిన ప్రదేశములలో నివసించుచున్న లేక వ్యాపారము చేయుచున్న వ్యక్తులమధ్య ఘటిల్లిన వివాదములు, లేక, వాటి విచారణాధికారము గల ప్రదేశ ములోని అభియోగ విషయము లు, లేక పూర్తిగాగాని, కొంతవరకుగాని వాటి విచారణాధికార దేశములలో నున్న వివాద విషయములును • ఇట్టి న్యాయసభలు విచారణలోనికి తీసికొని పరిష్కరింప నగును. అట్టి అభియోగములలో నుపయోగింపబడు న్యాయము, ఆ న్యాయవిచారణ సభకు చెందిన న్యాయమై యుండును. దానికి "లాఫోరి" (Lex Fori) అని పేరు. P వాది ప్రతివాదులు ఆ న్యాయ విచారణాధికారము గల ప్రదేశములో నివసింపనివారయినను, అన్య జాతీయు అయినను, వివాదకారణము దేశాంతరములో బయలు దేరిన దైనను, ఆ వివాద కారణము రెండుగాని, అంత కెక్కువగాని న్యాయశాస్త్ర విధానములతో సంబంధించి యున్న యెడలను పై పరిస్థితులలో న్యాయ విచారణ సభలు ఆ అభియోగమును పరిష్కరింపవలసి వచ్చినను లేదా పరిహారములు (Relief) ప్రసాదింపవలసి వచ్చినను, రెండు ప్రాథమిక సమస్యలు అట్టి అభియోగముల విష యమున బయలుదేరును:- (1) ఆ న్యాయ సభ యొక్క విచారణాధికారము, (2) ఆ వాద విషయమునకు ఉప యోగింపదగు న్యాయశాస్త్ర విధానము.