Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జలచలనము (Grrund water movement) ఆయా చోటులనుండు రాళ్ళయొక్క లక్షణములపై ఆధారపడి యుండును. బాగా తెరపుకలిగిన బీటికలు (Fissures) అతిఛిద్రత కలిగిన రాతిపొరలవలెనే పనిచేయును, ఈ నీటి ప్రవాహము తిరిగి వివిధములైన రాతిపొరల భేద్యత లోని వ్యత్యాసములపై కూడను ఆధారపడిఉండును. సాధారణపు బుగ్గలుగాక, కొన్ని చోట్లలో వేడి నీటి బుగ్గలుకూడ ఉండును. ఇవి ఉష్ణోగ్రత కలిగి ఉండును. ఈ ఉష్ణోగ్రత వివిధ ప్రదేశములలో వేరు వేరుగ నుండును. దీనికి రెండు ముఖ్యకారణము లున్నవని చెప్ప వచ్చును. అందులో మొదటిది నీరు అగ్నిపర్వతములున్న ప్రదేశములగుండ ప్రవహించుటవలన వేడెక్కుట; రెండ వది— నీరు చాల లో తైన ప్రదేశములగుండ ప్రవహించు నపుడు, అక్కడ నుండెకు అధిక ఉష్ణోగ్రత (Thermal gradient) వలన వేడెక్కుట, రసాయన క్రియ (Chemical action), సంఘర్షణ (Friction) కూడ ఉష్ణమునకు ఆధారములు. అమెరికాలోని ఎల్లో స్టోనుపార్కు, న్యూజిలాండు, ఐస్ లాండులలోని కొన్ని ప్రదేశములలో అంతర్జలము వేడినీటి ధారలుగాను లేక ఉష్ణోదక ప్రోత స్సులు (Geysers) గాను ఇవి బహిర్గతమగుచున్నవి. ఇవి చాల భాగము అగ్నిపర్వత ప్రదేశములలోనే కన్పడు చున్నవి. ఈ బుగ్గలు ఏర్పడుటకు అంతర్భాగములో అత్య ధిక ఉష్ణోగ్రత, చాల పొడవైన బీటికలు భూమిలోనికి వ్యాపించియుండుట చాల ముఖ్యమగు పరిస్థితులు. ' ఈ నీటిబుగ్గలు ఎల్లప్పుడును బహిర్గతమగుచునే యుండక మధ్యమధ్య విరామము చెందుచుండుట కద్దు. ఎల్లోస్టోన్ పార్కులోనున్న “ఓల్డు ఫెయిన్ ఫుల్ " అను వేడి నీటి బుగ్గ చాల ఆశ్చర్యకరమైనది. ఇది చాల సంవత్సరములనుండి సమాన విరామ కాలములతో వేడినీటిని బహిర్గతము చేయుచున్నది. ప్రతి 70 నిమిషములకు వేలకు వేల గాలనుల నీరు అతి తీవ్రమైన శక్తితో 2,800 అడుగులు ఎత్తువరకు పోవుచుండును. వేడి నీటిబుగ్గలే కాక, ఖనిజ పూరితమగు నీటి బుగ్గలు (Mineral springs) కూడ ఉన్నవి. వాటినుండి వివిధ పరిమాణములలో ఖనిజములు వెలువడును. వీటిలో కొన్నింటిని ఔషధములకు కూడ ఉపయోగించుదురు. 43 అంతర్జాలము నీటి బుగ్గల తరువాత చెప్పదగినవి నూతులు. ఇవి మట్టిలోను, ఇసుకలోను, లేక అంతర్జాలముతో నిండిన భేద్యమైన రాతి పొరలలోగాని, బీటికలతో నిండిన స్ఫటికమయ శిలలో గాని త్రవ్వుటవలన ఏర్పడును. అంతర్జాలము నూతి అడుగు భాగములోనికి రంధ్రముల ద్వార చొచ్చుకొని కొంత మట్టము వరకు వచ్చును. ఈ మట్టము క్రింద ఉండెడు జలపీడనముపై ఆధారపడి యుండును. మరొకరకము నూతులు ఆర్టీసియన్ నూతులు (Artesian wells). వీటిని పాతాళగంగ అనవచ్చును. వీటి నుండి నీరు ఎడ తెరిపిలేని ధారలుగా నేల పైభాగమున కొంత ఎత్తువరకు, చాలపీడన శక్తితో చిమ్ముచుండును. అంతర్జలము అత్యధిక జలపీడన శక్తి కలిగి ఉండుటయే దీనికి కారణము. ఈ విధముగ, అంతర్జాలము వివిధ రీతులలో, భూమి ఉపరిభాగము చేరి, మేఘములు గాను, వర్షముగాను, మార్పుచెంది, తిరిగి భూగర్భములోనికి ఇంకిపోవుచున్నది. అంతర్జాలము గురుత్వాకర్షణశక్తి ప్రాబల్యమున (In- fuence of gravity) సంపృక్త జలమట్టపు వాలులను అనుసరించుచు ప్రవహించును. నీరు భూతలము యొక్క స్వరూపమును ఏర్పరచుటయేగాక, భూమిలోపల కూడ పెక్కు మార్పులను కలిగించుటలో చాల ప్రముఖ పాత్ర వహించును. ఇది సున్నపురాయి మొదలయిన పెక్కు రాళ్ళగుండ ప్రవహించు నపుడు వాటి పొరల మధ్యను, అతుకులలోను రాతిని కరిగించుచు అంతర్మార్గములను విస్తరింప చేయును. ఆ మార్గములు కొన్నిచోట్ల భూమి పై ప్రవహించు నీటిచే మరింత పెద్దవై గెరాటిని బోలిన పెద్ద సొరంగ మార్గములుగా తయారగును. వీటినే మ్రింగు పొరంగములు (Swallow holes) అందురు. ఇటువంటి మ్రింగు సొరంగములు ప్రసిద్ధికెక్కిన మేమత్ గుహ ఉన్న కెంటకీ పీఠభూమిలో 80,000 పైగా ఉన్నవి. ఇట్లు రాళ్ళను కరిగించుటవలన ఏర్పడిన ద్రవము పెద్ద పెద్ద కీలులు (Master points), అతుకులు, రాతి పొరలు మొదలయిన వాటిగుండా ప్రవహించి వెక్కు సొరంగ మార్గములను (Caverns) గుహలను కూడ నిర్మించును. ఇటువంటి గుహలు, మెక్సికోలోని కారల్స్