Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాలము ఈ నుండు జెళ్లి చేపలు, రాతివంటి కొన్ని పగడములు తరగతిలో చేరును. వీటికి అన్నకోశము ప్రత్యేకముగ లేదు. జీర్ణాశయబిలమునందు విభాగములును, సూచ్యం గములును లేవు. మెడూసా సామాన్యముగా సన్నని పొరతో చిన్నదిగా నుండును. ఇవి ముఖ్యముగా లోతు లేని ఉప్పునీటిలో గుంపులుగాగాని, లేక ఒంటరిగాగాని, జీవించును. 2. ఛత్రికవర్గము ( స్కైఫోజోవా Scyphozoa ) :- పెద్ద జెల్లి చేపలు ముఖ్యముగా చతుర్భాగ అంగవర్తు ఛత్రా అత్వ సౌష్ఠవము గలిగి, ఘంటా కారముగనో, కారముగనో ఉండి స్వేచ్ఛగా ఈదగల ఛత్రికలు ఈ జాతిలో చేరును. వీటిలో ప్రత్యేకమగు అన్నకోశము లేదు. బఠరసంబంధమగు మీసము లుండును లింగసంబంధమగు పుర్వగకములు ఉత్పత్తిచేయు ఛత్రికలు అన్ని సముద్రం జీవరూపములను ఉత్పత్తిచేయుచున్నవి. చదు 3. పుష్పజీవములు (ఆంథోజోవా Antho Zoa):- ఈ తరగతిలో పగడములు, కుసుమాభములు మొదలగునవి గలవు. అన్నియు పుర్వగకములు మాత్రమే. ఛత్రికలు ఉండవు. ఏదై న ఆధారమును అంటి పెట్టుకొని యుందును. గుల్లగానుండు మీసములతో మౌఖిక వలయము నుగా నుండును. జీర్ణాశయబిలము అరలుగా నుండును. సూచ్యంగములు ఉండును. ఈ జీవులు ఒంటరిగను, సమూహములుగను ఉండును. ఇవి అన్నియు సముద్ర జీవు లు, • డి. బా. రె. మును ఇంక ననేక ఖాళీ ప్రదేశములను నింపుచున్నది. ఇందులో కొంతభాగము నీటిబుగ్గలుగాను, మరికొంత భాగము రాళ్ళలో నుండెడు సూక్ష్మరంధ్రముల ద్వారాను (Pores) అనేక వృక్షముల ద్వారాను, తిరిగి భూమి ఉపరిభాగ చేరుచుండును. వర్షము, మంచు, చెరువులు, నదులు, మొదలయిన వాటినుండి ఇంకుటవలన ఏర్పడిన అంతర్జలమును వర్షపాతజలము (Meteoric) అనియు, నీటిలో నేర్పడిన ఒండ్రుమట్టి పొరల (Sediments) మధ్య ఉండిపోయిన నీటిని కాన్నేటు జలము (Connate Water) అనియు అందురు. భూమి ఉపరిభాగమునుండి లోతుగ పోయినపుడు కొంత దిగువున మన్ను రాళ్ళు మొదలయినవన్నియు తడిగా నుండి సంపృక్తత (Saturation) చెంది ఉండును. ఈ మండలమును సంపృక్త మండలము (Zone of saturation) అందురు. దీని ఉపరిభాగము సంపృక్త జలమట్టము (Water table) అని పిలువబడును. ఇది తేమగా ఉండెడు ప్రదేశములలో తక్కువ లోతులోను, ఎడారివంటి ప్రదేశములలో వందలకొలది అడుగులు లోతుగాను ఉండును. ఈ మట్టము వర్ష కాలములో పైకివచ్చుచు, ఇతర కాలములో క్రిందికి దిగుచుండును. ఈ సంపృక్త జలమట్టము వివిధ ప్రదేశములలో మారుచు నుండును. ఇది ఆయా ప్రదేశములలో లభ్యనుగు అంత áల పరిమాణముపై నాధారపడి యుండును. ఈ పరి మాణము, తిరిగి శీతోష్ణస్థితి, శిలల స్వభావములు (Character of rocks) వీనిపై ఆధారపడి యుండును. అంతర్జలము:- భూమిమీద పడెడు వర్షపునీరు శీతోష్ణస్థితి, ఆవిరియగుట (Evaporation), వర్షపాతము కొంతభాగము ఆవిరిగా మారుట, కొంతభాగము నెలయేరులద్వార సముద్రములకు ప్రవహించుట, మరి కొంతభాగము భూమిలోనికి ఇంకుట అందరికి తెలిసిన విషయమే. ఇట్లు భూమిలోనికి ఇంకుచున్న నీరు, ఇంక ఇతర కారణములవలన కూడ భూమి ఉపరిభాగమున కొంతవరకు వ్యాపించియుండిననీరు అంతర్జల మన డును. నూతులు, నీటిబుగ్గలు (Springs) మొదలయి నవి, ఈ అంతర్జాలపు ఉనికిని కొంతవరకు తెలియచేయును. అనాదినుండియు నీరు రాళ్ళలోనికి పీల్చబడుచు, వాటిలోనుండు పగుళ్ళను (Cracks), బీటికలను (Fissures) 42 అను రెండు క్రియలద్వారా భూమిమీద జల పరిమాణ మును అదుపులో నుంచును. సచ్ఛిద్రత (Porosity), భేవ్యత (Permeability) అను శిలాస్వభావములు, రాళ్ళు పీల్చు కొను నీటి పరిమాణమును అదుపులో నుంచును. అంతర్జలము ఉపరిభాగమునకు ఊటలుగా (Seepages) గాని లేక నీటిబుగ్గలు (Springs) గా గాని వచ్చును. నీటి బుగ్గలు సాధారణముగా సంపృక్తజలమట్టము భూమి ఉపరిభాగమును తాకి అతిక్రమించునపుడును; భేద్యమైన శిలలు (Permeable rocks) అభేద్యమైన శిలలను (Im- permeable rocks) తాకు చోటను సంభవించ గలవు.